Viral News: జిమ్ములోనే క్లైంట్లతో జిమ్ ట్రైనర్ శృంగారం - వీడియోలు వైరల్ - పదుల సంఖ్యలో కాపురాల్లో చిచ్చు
Israel: అదో ఫేమస్ జిమ్. మంచి ట్రైనర్ ఉన్నారని పెళ్లి అయిన మహిళలు కూడా పెద్ద ఎత్తున క్యూ కడతారు. కానీ ఇప్పుడు వారి బతుకు రోడ్డున పడింది.

Israel Women and Gym Trainer clips Viral on Social Media: మంచి పేరున్న జిమ్‌లో మంచి ట్రైనర్ ఉంటే చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఫీజు అయినా కట్టి చేరిపోతూంటారు. శరీర దారుఢ్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఉంటారు. ఇలా ఇజ్రాయెల్ లోని ఓ జిమ్ కు కూడా మంచి పేరు ఉంది. అక్కడ ఉండే ట్రైనర్ .. మహిళలకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారని.. ఆయన ఇచ్చే ట్రైనింగ్ తో.. ఒంట్లో కొవ్వు అంతా కరిగి మహిళలు అంతా నాజుకుగా అవుతారని అనుకుంటారు. అందుకే అదే జిమ్ములో.. అదే ట్రైనర్ వద్ద చేరాలని మహిళలు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఇదంతా ఆయన ట్రైనింగ్ మహిమ అనుకున్నారు కానీ.. ఆ మహిళల భర్తలు కూడా తప్పుగా అనుకోలేదు. కానీ అక్కడ అసలు జరిగింది వేరు.
ఓ రోజు హఠాత్తుగా ఓ జిమ్‌లో మహిళలతో శృంగారం చేస్తున్న జిమ్ ట్రైనర్ వీడియోలు వైరల్ అయ్యాయి. జిమ్ములోనే ఎక్సర్ సైజులు ముగిసిన తర్వాతనో.. ముందో.. ఈ ఎక్సర్ సైజును కూడా వారు పూర్తి చేస్తున్నారు. ట్రైనర్ ఇలా ఒక మహిళతో కాదు.. దాదాపుగా తన మహిళా కైంట్లు అందరితో వివిధ సందర్భాల్లో ఈ పని చేస్తున్నాడు. అయితే అంతా గుట్టుగా సాగిపోయింది. తమ గురించి ఎవరికీ తెలియదని అనుకున్నారు. అది కూడా కసరత్తుల్లో భాగం అనుకున్నారేమో కానీ ఆ మహిళలు కూడా ఎప్పట్లాగే వచ్చి కసరత్తులతో ఈ పాటు ఈ పని కూడా పూర్తి చేసుకుని వెళ్లేవారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆ మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. జిమ్ ట్రైనర్ మంచోడేనని.. తాము చేసింది తప్పో ఒప్పో తమ ఇష్టమని.. అసలు ఆ వీడియోలను ఎవరు బయట పెట్టారో.. వారిపై చర్యలు తీసుకోవాలని కొంత మంది మహిళలు పోలీసులుక ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఈ పని జిమ్ ఓనర్ చేసి ఉంటాడని.. ఆయన ఒప్పందాలను ఉల్లంఘించాడని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జమ్ ఓవర్నీ అదుపులోకి తీసుకున్నారు. సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన వాటిని ఎందుకు సోషల్ మీడియాలో విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆయనపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ వీడియాలు బయటకు రావడంతో జిమ్ముకు వెళ్లిన మహిళల కుటుంబాల్లో చిచ్చు రేగి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో వీడియోలు కడా చాలా మందివి బయటకు వచ్చాయి. ఈ కారణంగా వారి ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. జిమ్ ట్రైనర్ కూడా అదేదో తన డ్యూటీ అయినట్లుగా అలా అంత మంది వివాహిత మహిళలతో ఎందుకు కాదనకుండా శృంగారం చేశారన్నది కూడా ఇజ్రాయెల్ లో చర్చనీయాంశంగా మారింది.