కడుపు నిండుగా ఆహారం తిన్న తరువాత ఎవరికైనా త్రేన్పులు రావడం అనేది సహజం. కానీ ఇక్కడ ఓ యువతి బిగ్గరగా త్రేన్చి ఏకంగా గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కింది. త్రేన్పులు అనేది ఎవరికైనా సహజం కానీ కొన్ని సందర్భాల్లో కొందరు దీనిని అసభ్యంగా పరిగణిస్తారు. అమెరికాకు చెందిన ఓ మహిళ పక్క వారికి ఎంత చికాకు గా అనిపించినప్పటికీ పెద్దగా త్రేన్చి గతంలో ఉన్న రికార్డులు బద్దలుగొట్టింది.


మేరీ ల్యాండ్‌ కు చెందిన కింబర్లీ వింటర్ అనే 33 ఏళ్ల టిక్‌ టాకర్‌ మహిళల బిగ్గరగా త్రేన్చడంలో ఉన్న రికార్డును తిరగరాయలని సంకల్పించింది. అందుకే ఆమె నిరంతరం దానికోసం సాధన చేసేది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తెలిపిన వివరాల ప్రకారం..కింబర్లీ వింటర్ తన బెలోయింగ్‌ బెల్చ్‌ 107.3 డెసిబెల్స్‌ కొలిచింది. 


2009 లో ఇటలీకి చెందిన ఎల్సా కాగోని అనే యువతి సాధించిన రికార్డును ఇది అధిగమించింది. ఆమె బెల్చ్‌ యొక్క శబ్దాన్ని అంచనా వేయడానికి ఎలక్ట్రిక్‌ హెల్డ్‌ డ్రిల్ (90-95 డీబీ), ఫుల్‌ థ్రోటిల్‌ లో ఉన్న కొన్ని మోటార్ సైకిళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. కింబర్లీ బెల్చ్‌ ను కొలవడానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వారు సౌండ్‌ప్రూఫ్‌ గదిలో కొలిచారు.


కింబర్లీ అనేక సందర్భాల్లో బర్ఫింగ్‌ చేయడాన్ని ఒక వీడియో రూపంలో తీసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె తాను తీసుకునే ఆహారం గురించి వివరించింది. ఒక ఐస్‌ డ్ కాఫీ, అల్పాహారం శాండ్‌ విచ్‌ , బ్యాకప్‌ గా ఒక బీర్‌ తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా బిగ్గరగా త్రేన్పులు వస్తాయని ఆమె వివరించింది. 


కింబర్లీ కొద్దిగా నీళ్లతో ఊపిరి పీల్చుకోగలిగనప్పుడు.....స్పైసీ ఫుడ్‌, ఆల్కహాల్‌ మరియు సోడా వంటివి తీసుకున్నప్పుడు బిగ్గరగా త్రేన్చడంలో ఎక్కువ సహాయ పడతాయని ఆమె వివరించింది.