Just In





Biden Jinping Meet: జిన్‌పింగ్ ఓ నియంత, మీడియా ముందే జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు
Jinping Biden Meet: చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఓ డిక్టేటర్ అంటూ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Xi Jinping Joe Biden Meet:
బైడెన్, జిన్‌పింగ్ భేటీ..
అమెరికా, చైనా మధ్య (US Vs China) చాలా ఏళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనాపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధించింది అమెరికా. అధ్యక్షుడిగా జో బైడెన్ వచ్చినప్పటి నుంచి ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది తరవాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు జో బైడెన్ (Joe Biden). ద్వైపాక్షిక బంధాన్ని (US China Bilateral Relations) మళ్లీ మునుపటిలా కొనసాగించేలా చర్చలు జరిగాయి. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్‌పింగ్ (Xi Jinping) ఓ నియంత అని కామెంట్ చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన Asia-Pacific Economic Cooperation సదస్సులో ఈ ఇద్దరు నేతలూ పాల్గొన్నారు. ఆ తరవాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ బైడెన్ జిన్‌పింగ్‌ని నియంత అని పిలవడం షాక్‌కి గురి చేసింది. గతేడాది కూడా బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
"జిన్‌పింగ్ ఓ నియంత. ఓ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. మన దగ్గర ఇలా కాదు. ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ చైనాలో అలా కాదు. అందుకే ఆయనో డిక్టేటర్."
- జోబైడెన్, అమెరికా అధ్యక్షుడు
గతంలోనూ ఇవే వ్యాఖ్యలు..
ఇప్పుడు కూడా ఆయనో ఓ డిక్టేటర్ అంటూనే చర్చలు (Joe Biden Xi Jinping Meet) సఫలమయ్యాయని వెల్లడించారు. దాదాపు నాలుగు గంటల పాటు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. గతేడాది నవంబర్ ఇండోనేషియాలోని బాలిలో G20 Summit జరిగింది. ఆ సమయంలోనే ఈ ఇద్దరు నేతలు కలుసుకున్నారు. ఆ తరవాత మళ్లీ కలుసుకుంది ఇప్పుడే. కొద్ది నెలల క్రితం చైనాకి చెందిన కొన్ని స్పై బెలూన్స్ (China Spy Balloons) అమెరికా గగనతలంలో ఎగిరాయి. కీలకమైన సైనిక స్థావరాల వద్ద అవి చక్కర్లు కొట్టడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అమెరికా సైనికులు ఆ బెలూన్స్‌ని పేల్చేశారు. ఇలాంటి కీలక తరుణంలో ఇద్దరు అధ్యక్షులూ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది.
"చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. పలు అంతర్జాతీయ సమస్యలపైనా ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం ప్రస్తావనా వచ్చింది. చైనా విషయంలో అమెరికా అభ్యంతరాలేమిటో పూర్తి స్థాయిలో జిన్‌పింగ్‌కి వివరించాను. అమెరికా పౌరులపై నిషేధం విధించడం, మానవ హక్కులు ఉల్లంఘించడం లాంటి అంశాలపనూ ప్రస్తావించాను. మిలిటరీ కాంటాక్ట్స్‌ని పునరుద్ధరించే విషయంపైనా చర్చ జరిగింది"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు