ఇరాన్ సైన్యం నుంచి తమ సైనికులకు ఎదురవుతున్న ముప్పుల నుంచి రక్షించుకోవడానికి అమెరికా ఈ ఆత్మరక్షణ దాడులు చేసింది.
US Attacks Iran: ఇరాన్ మిస్సైల్ సెంటర్లపై అమెరికా మెరుపు దాడులు! సీజ్ ఫైర్ సమయంలో మరోసారి ఉద్రిక్తత
US Iran War | ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవుపై అమెరికా సైన్యం దాడులు చేసింది. అమెరికాతో చర్చల్లో పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి.

- ఇరాన్ దేశం శాంతి చర్చలు జరుపుతున్నా అమెరికా దాడులు చేసింది.
- అమెరికా దాడుల్లో మైన్లు, మిస్సైల్ లాంచ్ సైట్లు లక్ష్యంగా చేసుకున్నారు.
- తన సైన్యాన్ని రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది.
- శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా సైనిక చర్య చేపట్టింది.
టెహ్రాన్: ఓవైపు సీజ్‌ఫైర్ కొనసాగుతోంది. శాంతిచర్చలు జరుపుతున్నాం, యుద్ధం ముగిసిందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా దాడులు చేసింది. అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ తెలిపిన సమయంలోనే ఈ దాడులు జరిగాయి. ఇరాన్‌కు చెందిన కొన్ని లక్ష్యాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఇందులో మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తున్న పడవలు, మిస్సైల్స్ ప్రయోగ కేంద్రాలు (మిసైల్ లాంచ్ సైట్లు) ఉన్నాయి. దీనిని అమెరికా ఒక డిఫెన్సివ్ యాక్షన్‌గా అభివర్ణించింది.
US సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పుల నుండి తమ సైనికులను రక్షించుకోవడానికే ఈ ఆత్మరక్షణ దాడులు చేసినట్లు తెలిపింది. CENTCOM ప్రతినిధి, నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ.. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ సమయంలో సంయమనం పాటిస్తూనే తన సైన్యాన్ని రక్షించుకుంటోందని పేర్కొన్నారు.
చర్చల పురోగతి వేళ దాడులు
అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించామని, అయితే యుద్ధాన్ని ముగించడానికి ఏ ఒప్పందం జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయ్ చెప్పిన సమయంలోనే అమెరికా దాడులు చేసింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, దక్షిణ ఓడరేవు నగరం, హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ నౌకాదళ స్థావరం అయిన బందర్ అబ్బాస్ సమీపంలోని ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు కెప్టెన్ హాకిన్స్ తెలిపారు.
బందర్ అబ్బాస్‌లో పేలుళ్ల శబ్దాలు వినపడటంతో స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికా చేసిన ఈ కొత్త దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. అమెరికా, ఇరాన్ మధ్య జరగనున్న శాంతి ఒప్పందంపై ఈ దాడులు ప్రభావం చూపనున్నాయి.
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధికారుల ప్రకటనలు
గత కొన్ని రోజులుగా ఇరుపక్షాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత తాము చర్చలు జరిపే ప్రతినిధులను తొందరపడి ఒప్పందం చేసుకోవద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఒప్పందం కుదరవచ్చని సోమవారం చెప్పారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందించారు. 'చర్చల పరిధిలో ఉన్న అంశాలలో ఎక్కువ భాగంపై మేం ఒక ముగింపు కోసం చూస్తున్నాం. కానీ త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని చెప్పడం సరికాదు. ఒప్పందంపై ఇరాన్ సంతకాలు చేస్తుందని ప్రచారం చేయడం సరికాదని' అన్నారు.
ప్రతిపాదిత ఒప్పందం, ప్రస్తుత పరిస్థితి ఏంటి..
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ అవగాహనా ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణను పొడిగించడం, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ సైన్యాలు ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. కానీ మధ్య మధ్యలో ఏదో చోట చిన్న చిన్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ నౌకలపై తన నియంత్రణను కొనసాగిస్తుండగా, USనేవీ ఇరాన్ ఓడరేవులను బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌పై అమెరికా ఎందుకు దాడి చేసింది?
అమెరికా దాడులు ఎప్పుడు జరిగాయి?
ఇరాన్‌తో శాంతిచర్చల్లో పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన సమయంలోనే అమెరికా దాడులు చేసింది.
ఈ దాడులలో అమెరికా లక్ష్యాలు ఏమిటి?
మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తున్న పడవలు, మిస్సైల్స్ ప్రయోగ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు?
కొన్ని రోజులుగా ఇరుపక్షాలు ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని, అయితే తొందరపడి ఒప్పందం చేసుకోవద్దని ప్రతినిధులను కోరినట్లు ట్రంప్ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























