అన్వేషించండి

US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!

US Iran conflict:హోర్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్స్‌ను అమెరికా కూల్చివేసింది. ఇదే టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యంపై కీలక ప్రకటన చేశారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా ఇరాన్ డ్రోన్లు కూల్చి, రాడార్ కేంద్రాలపై దాడి చేసింది.
  • ఇరాన్ క్షిపణి దాడులలో భారతీయ పౌరుడు మరణించాడు.
  • ట్రంప్ ప్రకారం ఇరాన్ సైనిక శక్తి భారీగా క్షీణించింది.
  • స్తంభించిన చర్చలకు, నిధులు విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది.

US Iran conflict:పశ్చిమాసియా మరోసారి రగులుతోంది. ఓవైపు శాంతి చర్చలు ముసుగు, మరోవైపు బాంబుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. పలు డ్రోన్‌లను కూల్చేసిన అమెరికా, ఇరాన్ వద్ద ఆయుధాలు భారీగా తగ్గిపోయాయని చెబుతోంది. చర్చల విషయంలో కూడా ఇరాన్ కొన్ని విషయాలు మొండికేస్తోందని ట్రంప్ అభిప్రాయపడతున్నారు.  

ఇరాన్ డ్రోన్స్‌ కూల్చేసిన అమెరికా

శనివారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్త నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన కనీసం నాలుగు వన్‌ వే టాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు కూల్చివేశాయి. ఈ డ్రోన్లు ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లేదా అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 

'నౌకలకు ముప్పు ఉందని చర్యలు'

దీనికి ప్రతి చర్యగా, అమెరికా కేవలం రక్షణకే పరిమితం కాకుండా, ప్రతీకార దాడులు కూడా చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతంలోని గొరుక్‌, ఖేష్మ్‌ఐలాండ్‌ లోని నిఘా రాడార్‌ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, మరిన్ని దాడులను నిరోధించేందుకు ఈ చర్యలు తప్పలేదని సెంటకామ్‌ స్పష్టం చేసింది. 

ఈ మధ్య భారతీయ పౌరుడు మృతి

ఈ ఘర్షణలు కేవలం దేశాల మధ్య పరిమితం కావడం లేదు. సామాన్యుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. ఈ వారం ప్రారంభంలో కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ క్రమంలో కువైట్‌విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మృతి చెందాడు. కువైట్ తన భూభాగంపైకి వచ్చిన 30 బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్నట్టు ప్రకటించింది. దీనిని హేయమైన ఇరాన్ దురాక్రమణగా అభివర్ణించింది. 

ఇరాన్ పని అయిపోయిందన్న ట్రంప్

మరోవైపు  మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ఇరాన్ సైనిక పరిస్థితిపై కీలక  వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరాన్ వద్ద 18 శాతం క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ సంఖ్య 21-22 శాతంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ డ్రోన్ తయారీ కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లు, ఇతర సైనిక మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు." మేము వారి సైన్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అయితే ఇంకా కొన్ని క్షిపణులు,డ్రోన్‌లు ఉన్నాయి. అవి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ ముందున్న ఉన్న శక్తి ఇప్పుడు లేదు" ని ట్రంప్ చెప్పారు. 

'గర్వంతో చేస్తున్నారు'

యుద్ధం జరుగుతున్నా, మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య సైనిక బలం కంటే ఆత్మగౌరవం చుట్టూ తిరుగుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్ నాయకులు చర్చలకు అంగీకరించకపోవడానికి వారి గర్వమే కారణమని, కానీ వారికి మరో మార్గం లేదని చెప్పారు. " వారు బలంగా ఉన్నామని , గర్వంతో ఉన్నారు. వారు ఎప్పుడు చేయమని అనుకున్న పనులను కూడా ఇప్పుడు చేయక తప్పదు. వారికి వేరే దారి లేదు.' అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. 

అయితే ట్రంప్‌ ఇరాన్ వాదన మరోలా ఉంది. అమెరికా తమ బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను ఫ్రీజ్ చేసిందని, వాటిని విడుదల చేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని వారు మొండికేస్తున్నారు. ప్రస్తుతానికి చర్చలకు డెడ్‌లాక్ పడిందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. 

Frequently Asked Questions

అమెరికా ఇరాన్‌ డ్రోన్లను ఎందుకు కూల్చివేసింది?

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు వాణిజ్య లేదా అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అనుమానించింది. నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా, దాడులను నిరోధించేందుకు ఈ చర్యలు చేపట్టింది.

ఇరాన్ సైనిక సామర్థ్యంపై ట్రంప్ ఏమని వ్యాఖ్యానించారు?

ఇరాన్ క్షిపణులు 18% మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దాడుల వల్ల డ్రోన్ తయారీ కేంద్రాలు, క్షిపణి లాంచింగ్ ప్యాడ్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు.

ఈ ఘర్షణల వల్ల భారతీయ పౌరులు ప్రభావితులయ్యారా?

అవును, ఈ వారం ప్రారంభంలో కువైట్‌లోని విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించాడు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఈ మృతి సంభవించింది.

చర్చలకు ఇరాన్‌ విధించిన షరతు ఏమిటి?

అమెరికా తమ బిలియన్ల కొద్ది డాలర్ల ఆస్తులను విడుదల చేస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చర్చలకు డెడ్‌లాక్ పడిందని చెప్పారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
US Russia Sanctions Bill: రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?
రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
Embed widget