అన్వేషించండి

US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!

US Iran War:హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా మెరుపుదాడులు చేసింది. వాణిజ్య నౌకలకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఈ దాడులు చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్లను అమెరికా అడ్డుకుంది.
  • ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా క్షిపణి దాడులు చేసింది.
  • వాణిజ్య నౌకలకు ముప్పుతో అమెరికా రక్షణ చర్యలు చేపట్టింది.
  • ఇరాన్ బలహీనంగా ఉందని, శాంతి కోరుతోందని ట్రంప్ పేర్కొన్నారు.

US Iran War:ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి మరోసారి రణక్షేత్రంగా మారింది. ఇరాన్ సైనిక చర్యలను అడ్డుకునేందుకు మెరుపు దాడులు నిర్వహించింది అమెరికా. బుధవారం అర్ధరాత్రి అత్యంత కీలకమైన స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. బందర్ అబ్బాస్‌ నౌకాశ్రయం సమీపంలో ని ఇరాన్ నియంత్రణ కేంద్రమే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 

అమెరికా క్షిపణి దాడులు

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితిని మరింత పెంచుతూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ప్రయోగించిన నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి. దీనికి కొనసాగింపుగా, ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌ నౌకాశ్రయ నగరం సమీపంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఐదో డ్రోన్ ప్రయోగాన్ని అమెరికా అడ్డుకోగలిగింది. 

నౌకలకు ప్రమాదం ఉందని దాడులు

ఈ దాడులు కేవలం ఆత్మరక్షణ కోసం చేసినవని అమరికా స్పష్టం చేసింది. అమెరికా అధికారుల కథనం ప్రకారం బంద్ అబ్బాస్ సమీపంలోని ఆ కేంద్రం నుంచి అమెరికా నౌకలపై మరిన్ని డ్రోన్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమమవుతోంది. ఆ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు, అమెరికా సైనిక బలగాలకు ఈ కేంద్రం వల్ల తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ డిఫెన్సివ్ స్ట్రైక్స్ నిర్వహించినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. 

మూడు పేలుళ్లు జరిగినట్టు కథనాలు

స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బందర్ అబ్బాస్‌ ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగాయి. అమెరికా క్షిపణులు ఇరాన్ సైనిక మౌలికసదుపాయాలను తాకగానే  ప్రాంతంలోని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కనీసం మూడు భారీ పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ పూర్తి చేసిందని, దీని వల్ల డ్రోన్ల ముప్పు తొలగిపోయిందని ప్రకటించాయి. 

ఇరాన్ ఆర్థికంగా చితికిపోయిందన్న ట్రంప్

ఈ దాడులు జరుగుతున్న టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఫ్రీఫాల్లో ఉందని, అక్కడ ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత బలహీన స్థితిలో ఉందని, వారు శాంతి చర్చల కోసం తహతహలాడుతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 

ఒమన్‌కు వార్నింగ్

చర్చల పేరుతో ఇరాన్ చేస్తున్న ప్రచారాన్ని ట్రంప్ ఖండించారు. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించేదుకు ఒమన్, ఇరాన్ మధ్య ఒప్పంద కుదిరిందన్న వార్తలను వైట్ హౌస్ తోసిపుచ్చింది. అటువంటి మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఏదీ లేదని, అది కేవలం కల్పితమని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఒక అంతర్జాతీయ జలమార్గమని, దానిపై ఏ ఒక్క దేశం నియంత్రణను అమెరికా అంగీకరించబోదని ట్రంప్ కచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు. 

వణికిపోతున్న ప్రపంచం

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతానికి పైగా బాధ్యత వహిస్తుంది. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా అది అంతర్జాతీయంగా ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత మూడు నెలలుగా కొసాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఇప్పటికే ఇంధన ధరలు పెరిగాయి. 

ఈ ఘర్షణలు ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు నిత్యకృత్యమయ్యాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తోంది. 

Frequently Asked Questions

హోర్ముజ్ జలసంధిలో అమెరికా ఎందుకు దాడి చేసింది?

ఇరాన్ నౌకలపై డ్రోన్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోందని, ఇది వాణిజ్య నౌకలకు, అమెరికా సైనిక బలగాలకు ముప్పు అని నిఘా వర్గాలు హెచ్చరించడంతో అమెరికా ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసింది.

అమెరికా దాడుల్లో ఇరాన్ వైపు ఏమైనా నష్టం జరిగిందా?

అమెరికా క్షిపణులు ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను తాకాయి, దీనితో కనీసం మూడు భారీ పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇరాన్ వైపు జరిగిన నష్టంపై నిర్దిష్ట వివరాలు లేవు.

హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత ముఖ్యమైనది?

ఈ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటిది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతానికి పైగా ఇక్కడ నుంచే జరుగుతుంది.

ట్రంప్ ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ఏమన్నారు?

ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఫ్రీఫాల్లో ఉందని, ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరుకుందని, ఇరాన్ అత్యంత బలహీన స్థితిలో ఉందని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Office Washroom Death:కార్పొరేట్ క్రూరత్వం -సెలవు ఇవ్వని మేనేజర్లు.. ఆఫీస్ వాష్ రూమ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన 29 ఏళ్ల యువతి!
కార్పొరేట్ క్రూరత్వం -సెలవు ఇవ్వని మేనేజర్లు.. ఆఫీస్ వాష్ రూమ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన 29 ఏళ్ల యువతి!
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
H1B Visa Fee: హెచ్‌1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌నకు ఫెడరల్ కోర్టు షాక్
హెచ్‌1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌నకు ఫెడరల్ కోర్టు షాక్
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NBK111 Glimpse : NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Cricketer Bharti Fulmali : మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget