అమెరికా, ఇరాన్ 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించే ఒప్పందానికి అంగీకరించాయి. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మహా ఒప్పందం ఖరారు! డొనాల్డ్ ట్రంప్ సంతకంపై ఉత్కంఠ
Donald Trump | అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలుపుతూ సంతకం చేయాల్సి ఉంటుంది.

- అమెరికా, ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపునకు అంగీకరించాయి.
- హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపివేతకు ఒప్పందం.
- ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయరాదని, ఆంక్షలు సడలింపునకు అంగీకారం.
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తర్వాతే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి.
వాషింగ్టన్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల మధ్య అమెరికా, ఇరాన్‌లు 60 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించే ఒప్పందానికి అంగీకరించాయి. అయితే, ఈ అవగాహన ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ట్రంప్ ఓకే చేస్తే.. మరో 2 నెలలపాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని, పరిస్థితుల్లో కొంత మార్పు ఉంటుందని పలు దేశాలు భావిస్తున్నాయి.
అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా?
న్యూస్ ఏజెన్సీ AFP వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణను పొడిగించడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయి. AXIOS నివేదిక ప్రకారం, ఇరాన్‌లో కూడా ఈ ఒప్పందం ముసాయిదాపై చర్చలు మొదలయ్యాయి. అమెరికా, ఇరాన్ అధినేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
Also Read: US Attacks Iran:హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత!ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారా.. ట్విస్ట్ ఇస్తారా..
అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఈ అవగాహన ఒప్పందం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు తెలియజేశామని, అయితే ఆయన ఇంకా దీనిపై సంతకం చేయలేదని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఈ తాజా ఒప్పందంపై సంతకం చేయాలా.. వద్దా అని ఆలోచించుకోవడానికి తనకు కొన్ని రోజులు కావాలని ట్రంప్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ టోల్ వసూలు చేయలేదు
హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపివేస్తారన్న వార్త పలు దేశాలకు ఊరట కలిగిస్తోంది. ఈ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా జరగాలని పేర్కొన్నారు. అంటే, ఈ ఒప్పందం కుదిరితే, ఈ కీలకమైన జలమార్గం ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేసే అవకాశం ఉండదు. హర్మూజ్ జలసంధిపై ఎవరూ హక్కులు పొందలేరని లేదా బెదిరించలేరని ఒక అమెరికా అధికారి తెలిపారు. దీంతో పాటు, ఇరాన్ 30 రోజుల్లోపు ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని మైన్‌లను తొలగించాలి.
ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకూడదు!
తాజా ఒప్పందం ప్రకారం, ఇరాన్ చమురును విక్రయించడానికి వీలుగా అమెరికా కొన్ని ఆంక్షలను సడలించేందుకు సిద్ధంగా ఉంది. ఒప్పందంలో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదనే కండీషన్ కూడా ఉంటుంది. కాల్పుల విరమణ సమయంలో, ఇరాన్ సుసంపన్న యురేనియంను ఎలా వెలికితీయాలనే దానిపై ఇరుపక్షాలు చర్చించి నిర్ణయిస్తాయి. దీంతో పాటు, ఇరాన్‌కు సంబంధించి విదేశాల్లో ఫ్రీజ్ చేసిన డబ్బును విడుదల చేయాలని కండీషన్ పెట్టారు.
దాడులు చేస్తూ ఆత్మరక్షణ అంటున్న అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, అమెరికా సైన్యం బుధవారం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 4నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాలిలోనే అడ్డుకుని విజయవంతంగా ధ్వంసం చేశాయి. దీనికి కొనసాగింపుగా, అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తూ.. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలోని ఇరాన్ నియంత్రణ కేంద్రమే లక్ష్యంగా అమెరికా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ వ్యూహాత్మక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై జరిగిన దాడి కారణంగా ఇరాన్ ప్రయోగించాలనుకున్న ఐదో డ్రోన్ చర్యను కూడా అమెరికా సమర్థవంతంగా అడ్డుకుందని తెలుస్తోంది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పొడిగించబడింది?
ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారా?
ఒప్పందంపై సంతకం చేయాలా వద్దా అని ఆలోచించుకోవడానికి తనకు కొన్ని రోజులు కావాలని ట్రంప్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఇంకా దీనిపై సంతకం చేయలేదు.
హర్మూజ్ జలసంధికి సంబంధించి ఈ ఒప్పందం ఏమని చెబుతోంది?
60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా జరగాలని పేర్కొన్నారు. ఇరాన్ ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని మైన్‌లను 30 రోజుల్లోపు తొలగించాలి.
ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందం ఏం చెబుతోంది?
ఒప్పందంలో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదనే కండీషన్ ఉంటుంది. కాల్పుల విరమణ సమయంలో, ఇరాన్ సుసంపన్న యురేనియంను ఎలా వెలికితీయాలనే దానిపై ఇరుపక్షాలు చర్చించి నిర్ణయిస్తాయి.
ట్రెండింగ్ వార్తలు























