US Iran War: 10 వేల సైన్యం, 100 ఫైటర్ జెట్స్, వార్ షిప్స్.. హర్మూజ్‌ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా
Strait of Hormuz | ఇరాన్ నౌకాశ్రయాల నుండి ఒక్క నౌక కూడా తమను దాటుకుని వెళ్లలేదని, అమెరికా బలగాల సూచనలతో 6 వాణిజ్య నౌకలు వెనుదిరిగాయని US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

Iran US War | పాకిస్తాన్ వేదికగా ఇరాన్‌తో జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా నేవీతో చుట్టుముడుతోంది. ఈ జలసంధిలో తాము పైచేయి సాధించినట్లు అమెరికా ప్రకటించిన 24 గంటల్లో ఏ నౌక కూడా అమెరికా దిగ్బంధనాన్ని దాటలేదని, 6 వాణిజ్య నౌకలు ఇరాన్ నౌకాశ్రయాలకు తిరిగి వెళ్లాయని అమెరికా వెల్లడించింది.
అమెరికా దిగ్బంధనం గురించి సెంట్రల్ కమాండ్ సమాచారం
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మంగళవారం (ఏప్రిల్ 14న)న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్ చేసింది. సెంట్రల్ కమాండ్ హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం మోహరింపుతో పాటు వార్ షిప్స్, విమానాల గురించి సమాచారాన్ని పంచుకుంది.
'అమెరికాకు చెందిన 10 వేల మందికి పైగా నేవీ సిబ్బంది, మెరైన్స్, ఎయిర్ ఫోర్స్ సైన్యం, ఒక డజనుకు పైగా యుద్ధ నౌకలు, డజన్ల కొద్దీ విమానాలు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే, బయలుదేరే నౌకలను దిగ్బంధించే పనిని సక్రమంగా నిర్వహిస్తున్నాయి. మొదటి 24 గంటల్లో ఏ ఒక్క నౌక కూడా అమెరికా దిగ్బంధనాన్ని దాటలేకపోయింది. 6 వాణిజ్య నౌకలు అమెరికా సైన్యం ఆదేశాలను పాటిస్తూ ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ నౌకాశ్రయాలకు వైపు తిరిగి వెళ్లాయని' సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది.
More than 10,000 U.S. Sailors, Marines, and Airmen along with over a dozen warships and dozens of aircraft are executing the mission to blockade ships entering and departing Iranian ports. During the first 24 hours, no ships made it past the U.S. blockade and 6 merchant vessels… pic.twitter.com/dpWAAknzQp
— U.S. Central Command (@CENTCOM) April 14, 2026
అన్ని దేశాల నౌకలపై ఆంక్షలు అమలు చేస్తున్నాం: అమెరికా సెంట్రల్ కమాండ్
అమెరికా సెంట్రల్ కమాండ్ మరింత సమాచారం పంచుకుంది. 'హర్మూజ్ జలసంధిలో మా దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ నౌకాశ్రయాలలోకి ప్రవేశించే లేదా అక్కడి నుంచి బయలుదేరే అన్ని దేశాల నౌకలపై మా ఆంక్షలు అమలు చేస్తున్నాం. ఇందులో అరేబియా సముద్రం, ఒమన్ గల్ఫ్‌లోని అన్ని ఇరాన్ నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్ యేతర నౌకాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే నౌకలకు హర్మూజ్ జలసంధిలో రాకపోకలకు సహకరిస్తోంది. అలాంటి నౌకలపై మేం ఎలాంటి ఆంక్షలు విధించలేదు' అని తెలిపింది.
బలగాల్ని మోహరించిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా హర్మూజ్ జలసంధిలో దిగ్బంధన మిషన్‌ను విజయవంతంగా నిర్వహించడానికి కీలక చర్యలు చేపట్టింది. 10 వేల మందికి పైగా సైనికులు, 100 కంటే ఎక్కువ ఫైటర్ జెట్స్, నిఘా విమానాలతో పాటు డజనుకు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. ఇందులో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, అంఫీబియస్ ట్రాన్స్‌పోర్ట్ డాక్ షిప్‌లు, అంఫీబియస్ అస్సాల్ట్ షిప్‌లు, డాక్ ల్యాండింగ్ షిప్‌లు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లు, లిటోరల్ కాంబాట్ షిప్‌లు, మానవరహిత విమానాలు (UAV), ల్యాండ్ అండ్ సీ బేస్డ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు ఇంటెలిజెన్స్, నిఘా విమానాలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు























