Boycott Turkey: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన దాని స్నేహ్ దేశం టర్కీని బహిష్కరించాలని డిమాండ్‌లు దేశంలో పెరుగుతున్నాయి. టర్కీ, అజర్‌బైజాన్‌ను బహిష్కరించాలని భారతీయ వ్యాపార సంస్థల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాట్) విజ్ఞప్తి చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ టర్కీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు పాకిస్తాన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.
చైనా వస్తువులకు వ్యతిరేకంగా బహిష్కరణ యాత్రను విజయవంతంగా నిర్వహించిన కాట్, ఇప్పుడు టర్కీ, అజర్‌బైజాన్‌కు వ్యతిరేకంగా కొత్త నినాదాన్ని అందుకుంది. తమ బహిష్కరణ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయడానికి, వారు ట్రావెల్ అండ్ టూరిజం ఆపరేటర్లతో సమన్వయంతో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ దేశాలతో వ్యాపారాన్ని నిలిపివేయడంపై తుది నిర్ణయం మే 16న న్యూఢిల్లీలో జరిగే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ డీలర్స్‌లో తీసుకుంటారు.
విస్తృతమవుతున్న బాయ్‌కాట్ టర్కీ
కాట్ చీఫ్ సెక్రటరీ, ఛాందనీ చౌక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, టూర్ అండ్ ట్రావెల్‌ను బహిష్కరిస్తే టర్కీ, అజర్‌బైజాన్ ఆర్థిక వ్యవస్థలపై చాలా పెను ప్రభావాన్ని చూపుతుందని, ముఖ్యంగా అక్కడి పర్యాటక రంగానికి నష్టం కలుగుతుందని అన్నారు.
గత సంవత్సరం అంటే 2024 సంవత్సరపు గణాంకాలను పరిశీలిస్తే, టర్కీలో దాదాపు 62.2 మిలియన్ విదేశీ పర్యాటకులు వచ్చారు. వీరిలో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. వారి పర్యాటన ద్వారా 61.1 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. భారతీయ పర్యాటకులు మాత్రమే 291.6 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అలాంటిది భారతీయ పర్యాటకులు బహిష్కరించడం వల్ల టర్కీకి భారీ ఆర్థిక నష్టం సంభవించవచ్చు.
అజర్‌బైజాన్‌లోని భారతీయ పర్యాటకులను ప్రస్తావిస్తూ ఖండేల్వాల్, 2024లో దాదాపు 2.6 మిలియన్ పర్యాటకులు వచ్చారని, వారిలో 2.5 లక్షల మంది భారతీయులని తెలిపారు. ఈ పర్యాటకులు పర్యాటక రంగం ద్వారా 308.6 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి అక్కడి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశారు. అలాంటిది భారతీయ పర్యాటకులు బహిష్కరించడం వల్ల భారీ నష్టం సంభవించవచ్చు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ దల్వాయి మాట్లాడుతూ, ఇది కచ్చితంగా జరగాలని అన్నారు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. వార్తా సంస్థ PTI తో మాట్లాడుతూ, టర్కీ ఒక విధంగా పాకిస్తాన్ కు ప్రత్యక్షంగా సహాయం చేసిందని అన్నారు.
టర్కీ బుకింగ్స్ రద్దు భారతీయ పర్యాటకులకు హాలిడే స్పాట్‌లో టర్కీ ఒకటి, కానీ ఇప్పుడు టర్కీకి చేసిన బుకింగ్‌లు రద్దు చేసుకుంటున్నారు. ట్రావెల్ కంపెనీ కాక్స్ & కింగ్స్ అజర్‌బైజాన్, టర్కీ, ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లాలనుకున్న వారంతా వెనక్కి తగ్గుతున్నారు.
వండర్‌వన్ CEO, సహ వ్యవస్థాపకుడు గోవింద్ గౌర్ అన్ని కొత్త బుకింగ్‌లను నిలిపివేస్తామని చెప్పారు. ముంబైకి చెందిన ట్రావెల్ అకామడేషన్ బ్రాండ్ గో హోమ్‌స్టేస్ టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో తన భాగస్వామ్యాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. పర్యాటకపరంగా, చైనా తర్వాత టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు భారతదేశం అతిపెద్ద మార్కెట్.
'టర్కీ కంటే చైనా ఎక్కువ సహాయం చేసింది'
హుస్సేన్ దల్వాయి మాట్లాడుతూ, "కానీ టర్కీ కంటే ఎవరైనా ఎక్కువ సహాయం చేసి ఉంటే, అది చైనా. ఇక్కడ దిగుమతుల్లో చైనా 13% కలిగి ఉంది. ఈ పెద్ద మిషనరీ చైనా నుంచి వచ్చాయి. కాబట్టి దాన్ని కూడా ఆపాలి. ఎందుకంటే చైనా దిగుమతులు, సరఫరాలు ప్రపంచంలోనే ఎక్కువగా భారతదేశానికి వస్తాయి. దాన్ని ఆపండి, అప్పుడు చైనా పాకిస్తాన్ కు ఎలా సహాయం చేస్తుందో మీరు చూస్తారు." అని అన్నారు.
పూణేలో టర్కిష్ ఆపిల్స్‌కు వ్యతిరేకంగా నిరసనపూణేలోని వ్యాపారులు టర్కిష్ ఆపిల్స్‌కు వ్యతిరేకిస్తున్నారు. పూణేలోని APMC మార్కెట్‌కు చెందిన ఆపిల్ వ్యాపారి సుయోద్ జెండే వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, "ఐదు-ఆరు రోజుల క్రితం పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినందున బహిష్కరించాం. టర్కీకి వివాదంతో సంబంధం లేదు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని మాత్రమే భారత్ వ్యతిరేకించింది. కానీ టర్కీ మధ్యలోకి రావడంలో అర్థం లేదు." అని అన్నారు.
"టర్కీ పాకిస్తాన్‌కు డ్రోన్‌లను ఇచ్చింది. అప్పుడు డ్రోన్ దాడి జరిగింది. మా రిటైల్ కస్టమర్లు, ప్రతిరోజూ మార్కెట్‌లో వేల పెట్టెలు తీసుకెళ్తారు. టర్కీ ఆపిల్స్ అవసరం లేదని మా కస్టమర్లు చెబుతున్నారు." అని వివరిస్తున్నారు.
పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: టర్కీ అధ్యక్షుడు
ఇంత జరుగుతున్నప్పటికీ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్‌కు అన్ని వేళలో అండగా నిలుస్తున్నానని తన పోస్ట్‌ల్‌లో రాసుకొచ్చారు. Xలో ఒక ట్వీట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. "నా ప్రియమైన సోదరుడు షాబాజ్, టర్కీ, పాకిస్తాన్ మధ్య సంబంధాలు నిజమైన సోదరభావం, స్నేహం, పరస్పర విశ్వాసానికి ఉదాహరణగా ఉన్నాయి. ఈ సంబంధం రాజకీయ సరిహద్దులకే పరిమితం కాదు, సాంస్కృతిక, సామాజిక, చారిత్రక దృక్కోణాల నుంచి కూడా ఇది లోతైనది." అని అన్నారు.
'పాకిస్తాన్-టర్కిష్ స్నేహం వర్థిల్లాలి!' అని టర్కీ అధ్యక్షుడు అన్నారు"వివాదాలను పరిష్కరించడంలో చర్చలపై నమ్మకం ఉంచిన పాకిస్తాన్ తెలివైన, ఓపికగల విధానాన్ని అభినందిస్తున్నాము. గుడ్ అండ్ బ్యాడ్ టైంలో మేము మీతో ఉన్నాము, ఉంటాం. మిత్రదేశమైన పాకిస్తాన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, "పాకిస్తాన్-టర్కీ స్నేహం వర్థిల్లాలి!" అని ట్వీట్ చేశారు.