అన్వేషించండి

Trump Threatens Oman:ట్రంప్ నెక్స్ట్‌ టార్గెట్ ఒమన్! హోర్ముజ్ జలసంధిపై మాట వినకపోతే తుడిచిపెట్టేస్తామని హెచ్చరిక!

Trump Threatens Oman:హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ప్రయత్నిస్తే తుడిచిపెట్టేస్తామని ఒమన్‌కు ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్‌తో జరగాల్సిన ఒప్పందంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోర్ముజ్ జలసంధిపై పట్టుకు ఒమన్ ప్రయత్నిస్తే హెచ్చరికలు జారీ చేశారు.
  • ఇరాన్ తో శాంతికి అబ్రహం ఒప్పందాన్ని చేర్చాలని గల్ఫ్ దేశాలకు సూచించారు.
  • చమురు వాణిజ్యం, ఇరాన్ పై ఒత్తిడి, అణ్వాయుధాల నివారణే లక్ష్యాలు.
  • కొత్త ఒప్పందాల కోసం అమెరికా గల్ఫ్ దేశాలపై తీవ్ర ఒత్తిడి పెంచనుంది.

Trump Threatens Oman:ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈసారి ఒమన్‌ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధిపై పట్టుకోసం ఏ దేశమైనా ప్రయత్నిస్తే వారిని ఉఫ్ అని ఊదేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

వాళ్లు మాకు బాకీ పడ్డారు: ట్రంప్

ఈ వివాదం కేవలం సముద్ర జలాలకే పరిమితం కాలేదు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరాలంటే గల్ఫ్ దేశాలు కచ్చితంగా అబ్రహం ఒప్పందాన్ని చేర్సాల్సిందేనంటూ కండిషన్ పెట్టారు. వారు మాకు బాకీ పడి ఉన్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే పెను మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. 

హోర్ముజ్ జలసంధి ఒక దేశానికే చెందింది కాదు: ట్రంప్

మే 28న జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిని ఇరాన్, ఒమన్ కలిసి ఉమ్మడిగా నియంత్రించే ప్రతిపాదన వ్యవస్థ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అత్యంత కఠినంగా స్పందించారు. హోర్ముజ్ అనేది అంతర్జాతీయ జలక్షేత్రం. దీనిని ఎవరూ తమ గుప్పిట్లో ఉంచుకోలేరు. ఒమన్ కూడా మిగిలిన దేశాల్లానే ప్రవర్తించాలి. లేదంటే మేం వారిని తుడిచిపెట్టేయాల్సి వస్తుంది అని నేరుగా హెచ్చరించారు. 

తెరపైకి అబ్రహం ఒప్పందం

మరోవైపు ఇరాన్ వ్యవహారంలో ట్రంప్ ఒక వ్యూహాత్మక లింక్ పెట్టారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే అబ్రహం ఒప్పందాలపై సంతకం చేస్తేనే ఇరాన్‌తో ఏదైనా డీల్ కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. 

మూడు కారణాలతో.. 

దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ప్రపంచంలోని మొత్తం చమురు వాణిజ్యంలో సుమారు 20-30 శాతం హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతోంది. దీనిపై ఇరాన్ లేదా ఇతర దేశాల పట్టు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా చేతుల్లో ఉండదు. తన మొదటి పదవీ కాలంలో ఇజ్రాయెల్‌- అరబ్ దేశాల మధ్య కుదిర్చిన అబ్రహం ఒప్పందాలను ట్రంప్ తన గొప్ప విజయంగా భావిస్తారు. ఇప్పుడు దీనిని పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలకు కూడా విస్తరించడం ద్వారా ఇరాన్‌ను ఒంటరి చేయాలనేది ఆయన ప్లాన్. ఇరాన్‌పై ఒత్తిడి, సైనిక ఒత్తిడిని పెంచడం ద్వారా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విడిచిపెట్టేలా చూడటమే అంతిమ లక్ష్యం. 

ప్రపంచ కూటమి ఏర్పాటుకు...

ట్రంప్ తన ప్రత్యేక దూతలు స్టీవ్ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌లను ఇప్పటికే రంగంలోకి దించారు. రాబోయే కొద్ది నెలల్లో గల్ఫ్‌ దేశాలపై ఈ ఒప్పందాల కోసం తీవ్రమైన ఒత్తిడి రానుంది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 2025 నాటికి ఈ ప్రాంతంలో కొత్త పన్ను విధానాలు, రక్షణ ఒప్పందాలు అమల్లోకి రానున్న వేళ ఈ లోపే ప్రపంచ కూటమి ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. 

ఏం జరుగుతుందో ఏమో?

హోర్ముజ్ జలసంధిలో స్వల్ప ఉద్రిక్తత తలతెత్తినా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగడం చూస్తూనే ఉన్నాం. సౌదీ అరేబియా ఇప్పటికే పాలస్తనా దేశం ఏర్పడితే ఇజ్రాయెల్ దేశంతో ఒప్పందం చేసుకుంటామని చెబుతోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్‌ హెచ్చరికలతో ఈ దేశాలు తమ నిర్ణయాలను మార్చుకుంటాయా లేదా అమెరికాపై ఎదురుతిరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది. తుడిచిపెట్టేస్తాం అంటూ చేసిన హెచ్చరిక బెదిరింపులేనా లేదా నిజంగానే సైనిక చర్యల ఉంటుందా అనే భయాందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. 

Frequently Asked Questions

హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎందుకు దృష్టి సారించారు?

ప్రపంచ చమురు సరఫరాలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై పట్టుకోసం ప్రయత్నించే దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్‌ లేదా ఇతర దేశాలు దీనిపై ఆధిపత్యం చెలాయిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా నియంత్రణలో ఉండదని ఆయన భావిస్తున్నారు.

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం గల్ఫ్ దేశాలకు ట్రంప్‌ పెట్టిన షరతు ఏమిటి?

గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే అబ్రహం ఒప్పందాన్ని చేర్చుకోవాలని ట్రంప్‌ షరతు విధించారు. దీని ద్వారా ఇరాన్‌ను ఒంటరి చేయాలని ఆయన యోచిస్తున్నారు.

అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే మార్పులకు ట్రంప్‌ వ్యాఖ్యలు ఎలా సంకేతమిస్తున్నాయి?

అబ్రహం ఒప్పందాలను ఇతర దేశాలకు విస్తరించడం, ఇరాన్‌పై ఒత్తిడి పెంచడం వంటివి అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే పెను మార్పులకు సంకేతాలుగా ఉన్నాయి. అంతిమ లక్ష్యం ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమాలను ఆపడమే.

హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

హోర్ముజ్ జలసంధిలో స్వల్ప ఉద్రిక్తతలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక మలుపు- అకస్మాత్తుగా పెంపుడు కుక్క మృతి
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Elon Musk Net Worth 2026:తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు! అదానీ, అంబానీల కంటే పది రెట్లు ఎక్కువ సంపద!
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyberabad Police Gym Extortion: ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
ఆ జిమ్ ట్రైనర్‌కుత్రీసమ్ ఫాంటసీ - లవర్ కూడా రెడీ - ఇద్దరూ కలిసి మహిళా పైలట్‌ను వేధించారు - చివరికి జైల్లో !
Jeedimetla Bangladeshi Nationals Arrested: హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
హైదరాబాద్‌లో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్ - పాస్‌పోర్టులు, వీసాలేం లేవు - ఎలా వచ్చారు?
Night Routine Habits : మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
మంచి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలా? అయితే రాత్రుళ్లు చేయాల్సిన పనులు ఇవే
Suriya Face Swap: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Mancherial Latest News: బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
బాసర టు భద్రాచలం ఆధ్యాత్మిక కారిడార్! ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం వరాలు!
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఘటనలో మరో ప్రాణం బలి - చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి
Bihar Mobile Tower Stolen: మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
మొబైల్స్ కాదు.. ఏకంగా మొబైల్ టవర్స్ చోరీ - బీహార్‌ దొంగలతో మామూలుగా ఉండదు మరి!
Embed widget