Bangladesh Hindu Killings: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు కేవలం నేరాలు కావు- ప్రభుత్వ వైఫల్యానికి, మైనారిటీల దుస్థితికి నిదర్శనం
బంగ్లాదేశ్ లో గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన హిందువుల హత్యలు కేవలం నేరాలుగా చూడకూడదని, ప్రభుత్వ వైఫల్యానికి, అక్కడ మైనారిటీల దుస్థితికి నిదర్శనంగా చూడాల్సి ఉంటుంది.

గత ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్‌లో హిందుుల హత్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా భారత ప్రభుత్వం స్పందించే స్థాయిలో హత్యలు జరిగాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తొలగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2025 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ లో జరిగిన హత్యలు కేవలం సాధారణ ఘటనలు కావు, ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వేధింపులు, దౌర్జన్యాలకు నిదర్శనంగా నిలిచాయి.
ఆ ఒక్కనెలలోపే రికార్డుల ప్రకారం 12 మంది హిందువులు హత్యకు గురయ్యారు. వీరిలో చాలా మంది మూక దాడులు, అందరూ చూస్తుండగానే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ అశాంతి, మతపరమైన అంశాలు, పరిపాలనలో వైఫల్యాలు కొనసాగితే మైనారిటీల పరిస్థితి ఎంతకు దిగజారుతుందో ఈ ఘటనలు తెలియజేశాయి. బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన హిందువులలో దీపు చంద్ర దాస్, అమృత్ మోండల్ (అలియాస్ సామ్రాట్), దిలీప్ బార్మాన్, ప్రాంతోష్ కర్మోకర్, జోగేష్ చంద్ర రాయ్, సుబర్ణా రాయ్, ఉత్పల్ సర్కార్, శాంతో దాస్, రిపోన్ కుమార్ సర్కార్, ప్రతాప్ చంద్ర, పలాష్ చంద్ర, స్వాధీన్ చంద్ర ఉన్నారు. అవి సాధారణ నేరాలుగా అధికారులు పేర్కొన్నా, బంగ్లాదేశంలో హిందువుల అభద్రతా భావాన్ని ఇవి బయటపెట్టాయి.
Bangladesh 🇧🇩 : 11 Hindus killed in the last 22 days .
— 🇧🇩🕉️News (@SanataniHinduBD) December 23, 2025
Name list :
1/12: Dilip Bormon
3/12: Prantosh Kormokar
6/12: Utpol Sarkar
7/12: Zogesh Chandra Roy & Suborna Roy .
12/12: Shanto Das
15/12: Ripon Kumar Sarkar
16/12: Pratap,Swadhin,Polash Chandra .
18/12: Dipu Das . pic.twitter.com/a4IuSjS7uh
బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు అక్కడి మెజార్టీ వర్గాల తీవ్రవాద ధోరణిని సూచిస్తున్నాయి. నిరంతరం భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ మైనారిటీలను హెచ్చరించేవారు. మార్పు, సంస్కరణకు బదులుగా బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలోనూ ఆందోళనలు చేపట్టి వారిని సైతం ప్రోత్సహించేవారు. భారత్ నుంచి ఎంతోసాయం పొందుతూనే, హిందువులపై విషం చిమ్మడం వారికి అలవాటుగా మారింది. డిసెంబరులో జరిగిన హత్యలలో ఎక్కువ శాతం మత దూషణ ఆరోపణలను సాకుగా చూపారు. ఇది హిందువులను లక్ష్యంగా చేసుకునే అవకాశం కల్పించింది. నిరాధార ఆరోపణలతో దాడులు, హత్యలు జరిగాయని తెలిసిందే. కొందరి విషయంలో చోరీ, నేర ప్రవర్తన ఆరోపణలు చేశారు. కానీ ఫలితం మాత్రం ఒకటే.. అమాయకులైన మైనారిటీ హిందువులను హత్య చేస్తూ వచ్చారు.
మైమెన్‌సింగ్ జిల్లాలో గార్మెంట్ కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య విషయంలో ఇదే జరిగింది. ఒక కార్యక్రమంలో ఇస్లాం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, మూకదాడి చేసి, అనంతరం చెట్టుకు కట్టేసి, ఉరివేసి నిప్పు పెట్టారు. తప్పు చేశాడని ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. రాజ్‌బారి జిల్లాలో అమృత్ మోండల్ ను దారుణంగా కొట్టి చంపారు. మతపరమైన కోణాన్ని తోసిపుచ్చడానికి అధికారులు అతనిపై నేర చరిత్ర ఉందన్నారు. దాంతో మైనారిటీలకు అక్కడ న్యాయం జరగదని ఈ ఘటన స్పష్టం చేసింది.
Another Hindu lynched to death by Radical Islamists in Bangladesh. Amrit Mandal (29) was beaten to death by a mob in Rajbari’s Pangsha area, barely days after Dipu Chandra Das. The same allegations were made that he said that all religions are the same that is blasphemy for them. pic.twitter.com/VMQVz8Lqvu
— Baba Banaras™ (@RealBababanaras) December 25, 2025
తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపులు, విద్యార్థి సంఘాలతో సహా వారి అనుబంధ సంస్థలు ఎన్నికలకు ముందు మద్దతు కోసం మైనారిటీ హిందువులను హత్య చేసి రాజకీయాలు చేశాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ హత్య ఘటనల్ని ఖండించినా బాధితులకు న్యాయం చేయడంలో విఫలమైంది. కొన్ని కేసుల్లో అరెస్టులు జరిగాయి, కానీ హిందూ మైనారిటీలకు భద్రత కల్పిస్తామని భరోసా ఇవ్వలేదు.
























