Russian Nuclear Protection Forces Chief Igor Kirillovover Killed: రష్యా రాజధాని మాస్క్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇందులో రష్య అణు భద్రతా దళం చీఫ్ మరణించారు. లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మంగళవారం (డిసెంబర్ 17) నివాస భవనం నుంచి బయలుదేరుతుండగా పేలుడు జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో దాచిన బాంబు పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. రష్యా మీడియా ప్రకారం... రిమోట్ ద్వారా బాంబును ఆపరేట్ చేశారు. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సుమారు 300 గ్రాముల పేలుడు పదార్థాలు ఉంచినట్టు చెబుతున్నారు. నిషేధించిన రసాయన ఆయుధాలను ఉక్రెయిన్‌లో సోమవారం (డిసెంబర్ 16) కిరిల్లోవ్ ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన రియాజాన్స్కీ ప్రాస్పెక్ట్‌లోని అపార్ట్మెంట్ భవనం వెలుపల జరిగింది. అక్కడ జనరల్ కిరిల్లోవ్, అతని సహాయకుడు ఇద్దరూ మరణించారు. రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఈ కేసును ధృవీకరించింది. రష్యన్ ఆర్మీకి చెందిన రేడియేషన్, రసాయన, బయోలాజికల్ రక్షణ దళాల అధిపతి జనరల్ కిరిల్లోవ్ హత్య వెనుక కారణాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
జనరల్ కిరిల్లోవ్‌పై ఉక్రెయిన్ ఆరోపణలు
కీవ్ ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం... ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలను జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ ఉపయోగించారని ఆరోపించింది. ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌లో నిషేధించినట్లు సమాచారం. ఈ ఆరోపణ తర్వాత జనరల్ కిరిల్లోవ్ మరణం రష్యాకు తీవ్రమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. క్రెమ్లిన్‌కు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రియాజాన్స్కీ ప్రోస్పెక్ట్‌లో పేలుడు జరిగింది. రష్యన్ వార్తా సంస్థ టాస్ ప్రకారం, విచారమ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఉన్నారు. ఇతర అత్యవసర సేవల ఉద్యోగులు కూడా స్పాట్‌లో వర్క్ చేస్తున్నారు.
Also Read: పాకిస్థాన్‌లో ఎన్ని హిందూ ఆలయాలున్నాయి? అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంది?