Israel Hamas War News: కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ (Hamas) నుంచి విడుదల కానున్న బందీల జాబితాను ఇజ్రాయెల్ (Israel) ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం మంగళవారం అందుకున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఖత్తర్ (Qatar)మధ్యవర్తిత్వం వహించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ నాలుగు రోజుల ఒప్పందం సోమవారం రాత్రికి ముసింది. అయితే దీనిని మరో రెండు రోజులు పొడిగించడంతో హమాస్ గాజాలోని బందీల కొత్త జాబితాను రూపొందిస్తున్నారు.


స్పెయిన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదానికి పరిష్కారం అవసరమని అరబ్ దేశాలు, యూరోపియన్ యూనియన్ భావించాయి.  స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన యూనియన్ ఫర్ మెడిటరేనియన్ సమ్మిట్‌లో, పాలస్తీనా అథారిటీ గాజాను పాలించాలని EU విదేశీ వ్యవహారాల చీఫ్ జోసెప్ బోరెల్ నొక్కిచెప్పారు. ఇది ఏకైక ఆచరణీయ పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మళ్లీ సోమవారం నుంచి శనివారం వరకు యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బెల్జియం, నార్త్ మెసిడోనియా, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, యూఏఈలను ఆయన సందర్శిస్తారు.


ఇప్పటి వరకు ఏం జరిగిందంటే
అక్టోబర్ 7న పాలస్తీనా టెర్రర్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు అపహరణకు గురైన 11 మంది మహిళలు, పిల్లలను హమాస్ విడుదల చేసింది. బందీలను పాలస్తీనా రెడ్‌క్రాస్‌కు అప్పగించగా తరువాత వారు ఇజ్రాయెల్ భద్రతా సంస్థలకు అప్పగించారు. ప్రతిగా ఇజ్రాయెల్ 33 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది. గత మూడు రోజులుగా మొత్తం 69 మందిని హమాస్ విడుదల చేసింది. ఇందులో ఇజ్రాయెలీలు, ఇతర దేశాల వారు ఉన్నారు. రెండు రోజుల సంధి పొడిగింపుతో ఇజ్రాయెట్ దాదాపు 150 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. 


ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ పర్యటన సందర్భంగా గాజాలో హమాస్ చేతిలో ఉన్న మిగిలిన బందీల విడుదల, పాలస్తీనా ఎన్‌క్లేవ్‌కు మానవతా సహాయం, పౌరులను రక్షించడం, ఇజ్రాయెల్ హక్కు గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చర్చిస్తారని అమెరికా తెలిపింది. గత రెండు నెలల్లో బ్లింకెన్ మూడోసారి ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి ఆశ, మానవత్వానికి నిర్వచనంగా నిలుస్తుందని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. గాజాలో సహాయక చర్యలు చేపట్టడానికి మానవత్వం సరిపోదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 


గాజాలో బాధితులకు సాయం అందించడానికి ఈజిప్ట్‌లోని రఫా సరిహద్దు సామగ్రి వెళ్తోందని అయితే ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న కెరెమ్ షాలోమ్ సరిహద్దు మీదుగా రిలీఫ్ ట్రక్కులు పంపించాలని UN కోరుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మధ్య పోరులో పొడిగించిన సంధిని వైట్ హౌస్ స్వాగతించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ ప్రక్రియలో మరింత లోతుగా ఆలోచిస్తున్నారని నెతన్యాహుతో ఖతార్ ఎమిర్ చెప్పారు. గురువారం ఉదయం వరకు గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపివేయడంపై వైట్ హౌస్ స్వాగతించిందని, ఈ విషయాన్ని ఖతార్ ప్రకటించడం అభినందనీయమన్నారు. 


ఈ విరామం హమాస్ చేతిలో ఉన్న మరో ఇరవై ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయడానికి, యుద్ధంతో నష్టపోయిన వారికి సాయం అందించడానికి దోహదపడుతుందని వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. వారాంతంలో 200 ట్రక్కులు సాయం రాఫా క్రాసింగ్ మీదుగా గాజా వెళ్లాయని, మరో 137 UN ట్రక్కులు గాజాకు త్వరలోనే చేరుకుంటాయని అన్నారు.