Nepal politicians and officials escaping via helicopter: నేపాల్‌లో జనరేషన్ జెడ్ యువత చేసిన ఉద్యమం కారణంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రాణభయంతో పారిపోయారు. వారిని నేపాల్ ఆర్మీ హెలికాప్టర్‌ల ద్వారా రక్షించింది. వారు హెలికాఫ్టర్ రోప్‌లకు వేలాడుతూ ఆందోళనకారుల నుంచి తప్పించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియా నిషేధం వంటి అంశాలపై జెన్-జెడ్ ఆందోళనకారులు నిరసనలు తీవ్రతరం చేయడంతో, ఈ ఘటనలు దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. సోషల్ మీడియా నిషేధం ఉపసంహరించబడినప్పటికీ, ఆందోళనలు ఆగలేదు, మరింత హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలీ, రాష్ట్రపతి రామ్‌చంద్ర పౌడెల్, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా వంటి ప్రముఖ నాయకుల నివాసాలను, పార్లమెంట్ భవనాన్ని, నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యుఎమ్‌ఎల్) కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
సెప్టెంబర్ 10, 2025న, నేపాల్ ఆర్మీ హెలికాప్టర్‌లు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను ఆందోళనకారుల నుంచి రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌లను చేపట్టాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోలు, అధికారులు హెలికాప్టర్ రోప్‌లకు వేలాడుతూ తప్పించుకునే దృశ్యాలను చూపించాయి.
సెప్టెంబర్ 8-9, 2025 తేదీలలో జరిగిన ఈ ఆందోళనలు నేపాల్‌లో ఇంతవరకు చూడని స్థాయిలో హింసను సృష్టించాయి. యువత ఆగ్రహిస్తే రాజకీయ నేతలు ఎలా పారిపోవాల్సి వస్తుందో.. నిరూపించేలా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ప్రధాని భార్యను కూడా ఆందోళన కారులు సజీవ దహనం చేయడంతో.. బతుకు జీవుడా అంటూ అనేక మంది ఆర్మీ హెలికాఫ్టర్ల తాళ్లను పట్టుకుని బయటపడ్డారు.
మొత్తం రాజకీయ నేతలు, అధికారయంత్రాంగం అంతా పరారైపోయింది. ఎవరు దొరికితే వారిని చంపేసేలా ఆందోళనకారులు ఉన్నారు. అయితే బుధవారం నాటికి పరిస్థితి కాస్తంత మెరుగుపడింది. ఆర్మీ కర్ఫ్యూ విధించింది. కొత్త ప్రధానిని నియమించి.. దేశాన్ని సాధారణ స్థితికి తెచ్చేదుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.