Mark Zuckerberg asked to leave Oval Office: మెటా చీఫ్ మార్క్ జుకర్ బెర్గ్ ను సమావేసానికి పిలిచి ట్రంప్ అవమానించారన్న ప్రచారం జరుగుతోంది. ట్రంప్ నిర్వహిస్తున్న సమావేశం హాలులోకి జుకర్ బెర్గ్ వచ్చారు. అక్కడ సైనికాధికారులతో ట్రంప్ సమావేశం నిర్వహిస్తున్నారు. దాంతో ట్రంప్ సూచనల మేరకు ఓవల్ ఆఫీసు నుంచి జుకర్ బెర్గ్ ను సిబ్బంది బయటకుతీసుకెళ్లారు. 

ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటకు రాలేదు కానీ..కొత్తగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.  అమెరికా వైమానిక దళం  ఆరవ తరం ఫైటర్ జెట్, ఎఫ్-47 స్టెల్త్ ఫైటర్ జెట్ గురించి చర్చించేందుకు ట్రంప్ సైనిక నాయకులతో ఒక అత్యంత రహస్య సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు.  ఈ సమావేశం జరుగుతున్న సమయంలో  జుకర్‌బర్గ్ అనుకోకుండా ఓవల్ ఆఫీస్‌లోకి ప్రవేశించారు, ఇది సైనిక నాయకులలో ఆశ్చర్యం , ఆందోళనను కలిగించిందని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి.  

ఈ సమావేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు జుకర్‌బర్గ్  అనుకోని ప్రవేశం రహస్య సమాచారం  లీక్ అవుతుందని  అందువల్ల అతన్ని బయటకు వెళ్లమని కోరారు.   జుకర్‌బర్గ్  తో పాటు ఒక యువ సహాయకుడు సమావేశంలోకి ప్రవేశించి  ట్రంప్‌కు ల్యాప్‌టాప్‌లో ఏదో చూపించి వెళ్లిపోయారు. అదే సమయంలో ట్రంప్   సెల్‌ఫోన్ కొన్ని సార్లు రింగ్ అయినట్లు అమెరికా మీడియా చెబుతోంది. అంటే  ఓవల్ ఆఫీస్‌లో భద్రతా ప్రోటోకాల్‌ ఉల్లంఘన జరిగిందని సైనికాధికారుల్లో ఆందోళన వ్యక్తమయింది. 

ట్రంప్ తన ఓవల్ ఆఫీస్‌ను “గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్”గా  చెబుతూంటారు. ఎందుకంటే అక్కడ నిరంతరం సందర్శకులు, సలహాదారులు,  సిబ్బంది రాకపోకలు సాగుతుంటాయి. ఇతర అధ్యక్షుల పరిపాలనల్లో ఓవల్ ఆఫీస్ లోకి సాధారణంగా ఎక్కువ మంది అడుగు పెట్టలేకపోయేవారు. ట్రంప్  పరిపాలనలో ఇది స్నేహితులు, సలహాదారులు,  క్యాబినెట్ సెక్రటరీలతో  బిజీగా ఉంటోంది.  జుకర్‌బర్గ్ మెటాలో ఫ్యాక్ట్-చెకింగ్ కార్యకలాపాలను తగ్గించడం, UFC అధ్యక్షుడు ,ట్రంప్ సన్నిహితుడు డానా వైట్‌ను మెటా బోర్డులో నియమించడం వంటి చర్యలు  తీసుకున్నారు. 

అయితే జుకర్ బెర్గ్ ను సమావేశం నుంచి బయటకు పంపలేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ ను కలిసేందుకు వచ్చిన ఆయన బయట వెయిట్ చేస్తున్నారని.. చెప్పారు. గెంటేశారనేది.. లేకపోతే మిలటరీ సమావేశంలో పాల్గొన్నారన్ని మిస్ లీడ్ చేయడమని అంటున్నారు.