అన్వేషించండి

Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!

Illegal Mosque Japan: టోక్యో సమీపంలో పాకిస్తాన్ రాయబారి ప్రారంభించిన మసీదు తీవ్ర వివాదాస్పదమైంది. చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా కట్టిన ఈ మసీదును కూల్చివేయాలని జపాన్ అధికారులు నిర్మయం తీసుకున్నారు.

Japan Illegal Mosque Inauguration Tokyo Demolition: ఏ దేశానికి వెళ్లినా పాకిస్తానీయుల తీరు మారదు.చివరికి అంబాసిడర్లు అయినా అంతే.  జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని కవాగోయ్  నగరంలో నిర్మించిన ఒక మసీదు తీవ్ర దౌత్య, న్యాయపరమైన వివాదానికి దారితీసింది. స్థానిక పురపాలక చట్టాలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ మసీదును కూల్చివేయడానికి జపాన్ అధికారులు రంగం సిద్ధం చేశారు.

అంబాసిడర్ హ్యాండ్ - అక్రమ నిర్మాణం 

ఈ వివాదానికి ప్రధాన కారణం ఏప్రిల్ 3, 2026న జరిగిన ఈ మసీదు ప్రారంభోత్సవమే. జపాన్‌లో పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ఈ మసీదును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే, ఆ తర్వాత స్థానిక మున్సిపల్ అధికారులు జరిపిన తనిఖీల్లో అసలు నిజాలు బయటపడ్డాయి. జపాన్ నగర ప్రణాళిక చట్టం ప్రకారం ఎటువంటి నిర్మాణాలకూ అనుమతి లేని  అర్బన్ డెవలప్‌మెంట్ కంట్రోల్ జోన్  లో ఈ మసీదును నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ కట్టడం పూర్తిగా అక్రమమైనదని జపాన్ అధికారులు తేల్చిచెప్పారు.

 కూల్చివేతకు నిర్ణయం

నిబంధనలను ఉల్లంఘించి కట్టిన ఈ మసీదుపై కవాగోయ్ నగర అధికారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భవన నిర్మాణానికి ముందే చట్టపరమైన నిబంధనలను పాటించాలని తాము గతంలోనే హెచ్చరించినప్పటికీ, నిర్వాహకులు పట్టించుకోకుండా అక్రమంగా ముందుకు సాగారని నగర కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఈ చట్ట ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జపాన్ అధికారులు.. సదరు మసీదును కూల్చివేయడానికి అవసరమైన పరిపాలనాపరమైన దరఖాస్తులను స్వీకరిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేశారు. 

 

 చేతులు ఎత్తేసిన పాకిస్తాన్ ఎంబసీ 

ఈ వ్యవహారం అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో, జపాన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం  వెంటనే ఆత్మరక్షణలో పడింది. ఈ నిర్మాణంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులు ఎత్తేసింది. జపాన్ చట్టాలకు కట్టుబడి ఉండాలంటూ మే 31న సోషల్ మీడియా వేదికగా పాక్ ఎంబసీ ఒక వివరణ ఇచ్చింది. మసీదు నిర్వాహకులు తమకు అన్ని చట్టపరమైన అనుమతులు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చి నమ్మించడం వల్లే తమ అంబాసిడర్ అబ్దుల్ హమీద్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, స్థానిక ప్రభుత్వాల చట్టాలను ఉల్లంఘించే ఎలాంటి ప్రాజెక్టులకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం మద్దతు ఇవ్వదని స్పష్టం చేస్తూ బుకాయించే ప్రయత్నం చేసింది.

 జపాన్ చట్టాలు చాలా స్ట్రిక్ట్ 

జపాన్ దేశంలో జోనింగ్ ,  నగర నిర్మాణ చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. గ్రీన్ జోన్లు, అర్బన్ కంట్రోల్ ఏరియాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా చిన్న గది కట్టినా సరే.. తక్షణమే స్టాప్-వర్క్ ఆర్డర్లు ఇవ్వడం, భారీ జరిమానాలు విధించడం లేదా పూర్తిగా కూల్చివేయడం లాంటి చర్యలు తీసుకుంటారు. ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రమేయం ఉన్నప్పటికీ, చట్ట ఉల్లంఘనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని జపాన్ అధికారులు స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
ఈ ఘటన జపాన్‌లో నివసిస్తున్న పాకిస్తానీ కమ్యూనిటీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. స్థానిక జపాన్ ప్రజల సెంటిమెంట్లతో పాటు, మున్సిపల్ చట్టాలను గౌరవించకుండా ఇలాంటి మతపరమైన కట్టడాలను అక్రమంగా నిర్మించడంపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశ రాయబారి స్వయంగా వచ్చి అక్రమ కట్టడాన్ని ప్రారంభించడం పాకిస్తాన్‌కు దౌత్యపరంగా పెద్ద అవమానంగా మారింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget