Hamas Palestine Attack: 


హమాస్ కమాండర్ మృతి..


హమాస్‌ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయేల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. వరుస పెట్టి అన్ని బంకర్‌లనూ ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో పౌరులూ ప్రాణాలు కోల్పోతున్నా వెనక్కి తగ్గడం లేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసి దాడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయేల్ ఎయిర్‌ ఫోర్స్‌ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే హమాస్ ఎయిర్‌ ఫోర్స్ చీఫ్‌ హతమయ్యాడు. ఇప్పుడు మరో హమాస్ కమాండర్‌ని మట్టుబెట్టింది ఇజ్రాయేల్ సైన్యం. ఇజ్రాయేల్ సరిహద్దు గ్రామాలైన నిరిమ్, నిర్ ఆజ్‌ ప్రాంతాలపై దాడులను లీడ్ చేసిన కమాండర్‌ బిలాల్ అల్ కెద్రా ఉన్న భవనాన్నే లక్ష్యంగా చేసుకుని రాకెట్‌ల వర్షం కురిపించింది. ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రటించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేసింది. 


"ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్‌ వరుస దాడులతో గాజా సరిహద్దు వద్ద ఉన్న హమాస్ ఉగ్రవాదులు చెల్లాచెదురయ్యారు. ఈ దాడుల్లో హమాస్ కమాండర్ బిలాల్ హతమయ్యాడు. సరిహద్దు గ్రామాల్లో హమాస్ దాడులను బిలాల్ లీడ్ చేశాడు. మరి కొన్నిచోట్లా దాడులు జరిగాయి. జేటన్, ఖాన్ యూనిస్, వెస్ట్ జబలియా ప్రాంతాల్లో ఇజ్రాయేల్ మిలిటరీ పెద్ద ఎత్తున మొహరించింది. ఈ దాడుల కారణంగా హమాస్‌ బాగా దెబ్బ తింది. ఆపరేషనల్ కమాండ్ సెంటర్స్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నాం. ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కి చెందిన కమాండ్ సెంటర్‌లనూ నేలమట్టం చేశాం."


- ఇజ్రాయేల్ ఎయిర్ ఫోర్స్