Reasons For Naked Protest: మహిళలు ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ ఇంకా వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. వారు హింసకు గురి అవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు, ఎన్ని డిబేట్‌లు జరుగుతున్నా, వారు ఎంత తిరగబడుతున్నా కొన్ని ప్రాంతాల్లో మార్పు రావడంలేదు. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పని చేస్తున్నాయి. మహిళల బాగోగులు చూస్తూనే వారిని హింసకు దూరంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా మారని వారిపై మహిళలు మరోసారి గళమెత్తుతున్నారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే మహిళలపై ఆంక్షలు విధించడంతో వారిలో అసహనం వార్ ప్రకటిస్తోంది. అందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహిళలు నగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. కొందరు పూర్తి నగ్నంగా ప్రదర్శనలు చేస్తే మరికొందరు అర్థనగ్న ప్రదర్శనలు చేపడుతున్నారు.
నగ్న ప్రదర్శనలను మహిళలు శక్తిమంతమైన ఆయుధంగా మార్చుకున్నారు. సాధారణ నిరసనలు, ధర్నాలతో తమ సమస్యలను పట్టించుకున్న వారు లేరని అందుకే ఇలాంటి దూకుడు ఉద్యమానికి తెరలేపుతున్నారు. సామాజికంగా జరుగుతున్న అన్యాయం, రాజకీయ అణచివేత, హింస, మహిళల హక్కులకు విలువ లేకపోవడంపై నిరసన తెలియజేస్తున్నారు. తమ వాయిస్‌ను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఈ ప్రక్రియను ఎంచుకుంటున్నారు.
మహిళల అర్ధనగ్న ప్రదర్శనలు సాధారణంగా కీలక రాజకీయ సమావేశాల్లో, దేశాధినేతలు పాల్గొనే కార్యక్రమాల్లో, ఏదైనా పండగ టైం, ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే వేదికలపై కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా, ప్రజల దృష్టి తమపై పడుతుందని నిరసనకారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి వేదికను ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి వ్యూహాలతో చాలా సమస్యలకు పరిష్కారం లభించి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచం చర్చించుకున్న సమస్యలు కూడా ఉన్నాయి. ఆలోచించే సందర్భాలు చూశాం. మహిళలు చేస్తున్న ఈ ప్రయత్నం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉక్రెయిన్- ఫ్రాన్స్ ఫెమెన్ ఉద్యమం
ఫెమెన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళా హ్కుల కోసం పని చేస్తున్న స్త్రీవాద సంస్థల్లో ఒకటి. ఈ వేదిక తమ డిమాండ్లను ప్రభుత్వం, ప్రపంచ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు రకరకాల వ్యూహాలతో పోరాటాలు చేస్తుంటుంది. ఈ సంస్థ ఉక్రెయిన్‌లో పుట్టింది. ఈ స్త్రీవాద సంస్థ అర్థనగ్న ప్రదర్శనలు చేయడం ద్వారా మహిళలపై జరిగే దోపిడీ, అవినీతి , మతపరమైన సంప్రదాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపిస్తుంటుంది.
అర్జెంటీ మహిళా ఉద్యమం
అర్జెంటీనాలో 21 జూన్‌లో "నీ ఉనా మెనోస్" ఉద్యమం మొదలైంది. ఒకరు కూడా తక్కువ కాదు అని దీనికి అర్థం. ఇందులో అనేక వందల మంది మహిళలు అధ్యక్ష భవనం ముందు నగ్నంగా ప్రదర్శనలు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసనల గురించి తెలుసు.
డాక్యుమెంటరీ ప్రభావంతో ఫ్రీ ది నిపుల్ ప్రచారం
అమెరికాలో 2012లో స్త్రీలపై ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరిగింది. దీన్ని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ చివరకు దీన్ని 2013లో విడుదల చేశారు. దీన్ని లీనా ఎస్కో నిర్మించారు. ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మహిళలు ఫ్రీ ది నిపుల్ ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా కారణంగా ఇది మరింత ఊపందుకుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజలు దీనికి జై కొట్టారు. మీడియా ముందు కెమెరాల ముందు టాప్‌లెస్‌గా నిలబడి మహిళా సమస్యలపై గళమెత్తారు.
ఎద్దులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా టాప్‌లెస్ ప్రదర్శన
కేవలం మహిళా సమస్యలపై మాత్రమే కాకుండా జంతువులపై జరుగుతున్న హింసను కూడా మహిళలు వ్యతిరేకిస్తూ నగ్న ప్రదర్శన చేపట్టిన ఘటనలు ఉన్నాయి. స్పెయిన్‌లో జరిగే బుల్‌రేస్‌కు వ్యతిరేకంగా చాలా మహిళా సంఘాలు ఉద్యమం చేశాయి. మూగజీవాలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ నగ్నంగా రోడ్డపై ఆందోళనచేపట్టారు మహిళలు. ఇప్పటికి కూడా ఇలాంటి ఆందోళనలు కనిపిస్తుంటాయి. పాంప్లోనా నగరంలో జరిగే ప్రసిద్ధ రన్నింగ్ ఆఫ్ ది బుల్స్ వేడుకల సమయంలో ప్రదర్శనలు చేస్తుంటారు.
మహిళల నగ్న ప్రదర్శనలు
స్త్రీవాద సంస్థలు తరచుగా తమ డిమాండ్‌లను ప్రభుత్వాలకు, మీడియా సంస్థలకు చేరవేయడానికి నగ్న ప్రదర్శనలను ఓ మార్గంగా మార్చుకుంటున్నారు. అందరూ దృష్టి సారించే ఇలాంటి వేదికలై మహిళా హక్కులపై గళమెత్తనున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, గృహ హింస, వివపక్షపై ప్రశ్నిస్తున్నారు.