Donald Trump Colcludes UK visit | లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) UK పర్యటనను ముగించుకున్నారు. వైట్ హౌస్‌ను ఉటంకిస్తూ, ట్రంప్ తన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి లండన్ నుండి తిరిగి బయలుదేరేటప్పుడు "చిన్నపాటి హైడ్రాలిక్ సమస్య" తలెత్తిందని CNN రిపోర్ట్ చేసింది. దాంతో ట్రంప్ దంపతులు మరో హెలికాప్టర్‌కు మారవలసి వచ్చింది.
లండన్ ఎయిర్ పోర్టులో చాపర్ ల్యాండింగ్ డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో హైడ్రాలిక్ సమస్య తలెత్తడంతో స్థానిక విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లేవిట్ వెల్లడించారు. ఈ సంఘటన కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మెలానియా సహాయక హెలికాప్టర్‌కు మారవలసి వచ్చింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని Stansted Airportకు చేరుకోవడంలో ఆలస్యం జరిగిందని CNN నివేదించింది. "చిన్నపాటి హైడ్రాలిక్ సమస్య కారణంగా, ముందు జాగ్రత్త చర్యగా పైలట్‌లు Stansted Airportకు చేరుకోకముందే స్థానిక విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా సురక్షితంగా సహాయక హెలికాప్టర్‌లో ఎక్కారు" అని లేవిట్ ప్రెస్ పూల్‌కు ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్, మోదీతో బెస్ట్ రిలేషన్ ఉందన్న ట్రంప్ ట్రంప్ గురువారం నాడు యూకే పర్యటనను ముగించుకున్నారు. UK ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మెర్‌తో కలిసి ట్రంప్ విలేకరుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ట్రంప్ భారతదేశంతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని హైలైట్ చేశారు. వారి వ్యక్తిగత సంబంధాలను, ఇటీవల పుట్టినరోజు నాడు చెప్పిన శుభాకాంక్షలను నొక్కిచెప్పారు. ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపానని, రెండు దేశాల మధ్య ఉన్న మంచి సంబంధాలను హైలైట్ చేశానని పేర్కొన్నారు.
పుతిన్ చాలా నిరాశపరిచాడు..ట్రంప్ మాట్లాడుతూ, "నేను భారతదేశానికి, భారత ప్రధాని మోదీకి చాలా దగ్గరగా ఉన్నాను. మొన్న ఆయనతో మాట్లాడాను, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. మాకు మధ్య మంచి సంబంధం ఉంది’ అన్నారు. ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోవడం తనను చాలా నిరాశపరిచిందని పేర్కొన్నారు. చాలా మందిని చంపుతున్నాడు. రష్యా చంపుతున్న దాని కంటే ఎక్కువ మందిని కోల్పోతుంది.
నిజం చెప్పాలంటే, ఉక్రెయిన్ సైనికుల కంటే రష్యా సైనికులే ఎక్కువ చనిపోతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిష్కరించడం సులభమని భావించినప్పటికీ, అది అలా జరగలేదు. నేను వైట్ హౌస్‌లో ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమయ్యేది కాదు. ఆ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇది ఎప్పుడూ జరిగి ఉండేది కాదు. ఇలా నాలుగేళ్ల పాటు యుద్దం జరిగేది కాదు. చాలా మంది ప్రజలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు’ అని ట్రంప్ తెలిపారు.