French President Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ యొక్క భార్య బ్రిగిట్టే మాక్రాన్ ఆయనను చెంపదెబ్బ కొట్టినట్లు ఒక వీడియో వైరల్ అయింది. మేక్రాన్ దంపతులు వియత్నాం పర్యటనకు వెళ్లారు. హనోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా, ఆయన భార్య బ్రిగిట్టే మాక్రాన్‌తో కలిసి విమానం నుండి దిగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో బ్రిగిట్టే మాక్రాన్ మాక్రాన్ ముఖంపై చేతితో కొట్టినట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన విమానం నుండి దిగుతున్న సమయంలో జరిగిందని, ఆ తర్వాత బ్రిగిట్టే మాక్రాన్ ఆయన చేయి పట్టుకోవడానికి నిరాకరించింది. మాక్రాన్, బ్రిగిట్టే విమానం నుండి దిగుతూ, స్వాగతం కోసం వేచి ఉన్న అధికారుల వైపు నడుస్తున్నారు. ఈ సమయంలో, బ్రిగిట్టే తన చేతిని మాక్రాన్ ముఖం వైపు ఆడించినట్లు కనిపిస్తుంది, దీనిని కొందరు "చెంపదెబ్బ"గా, మరికొందరు "తోసుకోవడం" గా వర్ణించారు.
ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ఎలీసీ ప్యాలెస్ మొదట ఈ వీడియోను "తప్పుగా అర్థం చేసుకున్న సంఘటన"గా ప్రకటించింది. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిగిట్టే మాక్రాన్ మధ్య వయసు తేడా చాలా ఎక్కువ. 2007లో వివాహం చేసుకున్నారు. బ్రిగిట్టే మాక్రాన్ మాజీ ఉపాధ్యాయురాలు. మేక్రాన్ కంటే ఆయన భార్య పాతికేళ్లు పెద్దది.