Chinese Microwave Weapon: ఆయుధ ప్రపంచంలో చైనా సాధించిన విజయాలతో అమెరికా, యూరప్ సహా మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గన్‌పౌడర్, బాంబులు లేదా షెల్స్ లేకుండా లక్ష్యాలను సునాయాశంగా నాశనం చేయగల ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు చైనా ప్రకటించంది. చైనా శాస్త్రవేత్తల చెప్పిన ప్రకారం, ఈ ఆయుధం చాలా శక్తివంతమైంది, ఇది అంతరిక్షంలో మోహరించిన ఉపగ్రహాలను నాశనం చేయగలదు. దీనిని స్టార్‌లింక్ కిల్లర్ అని కూడా పిలుస్తారు, ఇది ఎలాన్ మస్క్  శాటిలైట్‌ను సైతం ధ్వంసం చేయగలదు.  మన ఇంటి మైక్రోవేవ్‌ ఓవెన్‌ ఆహారాన్ని వేడి చేసినట్టు,ఇది ఉపగ్రహాల సిస్టమ్‌ను వేడి చేసి నాశనం చేస్తుంది. 

చైనాకు చెందిన ఇన్విజిబుల్ హంటర్

చైనా ఒక హై-పవర్ మైక్రోవేవ్ (HPM) ఆయుధాన్ని అభివృద్ధి చేసింది, దీనిని శాస్త్రవేత్తలు ఇన్విజిబుల్ హంటర్ అని పిలుస్తారు. చైనా మీడియా, రీసెర్చ్ జర్నల్స్‌ ప్రకారం, ఈ వ్యవస్థ యాంటీ శాటిలైట్‌ క్షిపణులు ఉపయోగించకుండానే ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను డీ-లింక్ చేయగలదు. ఇది 20 గిగావాట్ల వరకు శక్తిని అందించగల కాంపాక్ట్ డ్రైవర్‌గా చెబుతున్నారు. భూమి, సముద్రం, గాలి లేదా అంతరిక్షం వంటి ఏ ప్లాట్‌ఫామ్ నుంచి అయినా దీన్ని లాంచ్ చేయవచ్చ. 

తైవాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో చైనా చేసిన పని చర్చనీయాంశమవుతోంది. ఏదైనా సంక్షోభం తలెత్తితే స్టార్‌లింక్, అమెరికా, దాని మిత్రదేశాల కమ్యూనికేషన్లు, నిఘా వ్యవస్థలతో ప్రమాదం ఉంటుందని బీజింగ్ భయపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌లింక్ పాత్ర సైనిక వ్యూహకర్తల దృష్టిని కూడా ఆకర్షించింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన వెంటనే, ఎలాన్ మస్క్ ఉక్రెయిన్ అధ్యక్షుడి అభ్యర్థన మేరకు స్టార్‌లింక్ సేవను యాక్టివేట్ చేశారు. ఆ టైంలో ఉక్రెయిన్‌కు కమ్యూనికేషన్ వ్యవస్థలో మంచి ఫేవర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయంలో చైనా అనుమానపడుతోంది. 

రష్యా సైనస్-7 కంటే ఇది ఎంత శక్తివంతమైనది?

యురేషియన్ టైమ్స్‌లోని వచ్చిన ఒక నివేదిక ప్రకారం, చైనాలోని జియాన్‌లోని నార్త్‌వెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ (NINT) శాస్త్రవేత్తల బృందం TPG1000Cs అనే డ్రైవర్‌ను అభివృద్ధి చేసింది, దీనిని ప్రపంచంలోనే మొట్టమొదటి కాంపాక్ట్ హై-పవర్ మైక్రోవేవ్ డ్రైవర్‌గా అభివర్ణిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరికరం ఒక నిమిషం పాటు 20 గిగావాట్ల పవర్‌ను అందించగలదు. ఒకే సెషన్‌లో 3,000 వరకు హై ఎనర్జీ పల్స్‌స్‌ను జనరేట్ చేస్తుంది. 

రష్యాకు చెందిన సైనస్-7 వ్యవస్థ సుమారు 10 టన్నుల బరువు కలిగి, కేవలం 1 సెకను మాత్రమే పనిచేసి ఒకసారి సుమారు 100 పల్స్‌స్‌ను అందించగలదని తెలుస్తోంది. TPG1000Cs సుమారు 4 మీటర్ల పొడవు, సుమారు 5 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రక్కులు, యుద్ధనౌకలు, విమానాలు లేదా ఉపగ్రహ ప్లాట్‌ఫారమ్‌లపై అమర్చవచ్చు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు 200,000 కంటే ఎక్కువ ఆపరేషనల్ పల్స్‌స్‌ను సేకరించిందని అంటున్నారు. మరిన్ని ప్లాట్‌ఫామ్‌లపై లాంచ్‌ చేసేందుక మార్గాన్ని సుగమం చేసిందని NINT బృందం చెబుతోంది.

చైనా స్టార్‌లింక్-కిల్లర్ ఆయుధ అభివృద్ధి 

TPG1000Cs వంటి వ్యవస్థలను అంతరిక్షంలో మోహరించినట్లయితే, వాటి మాయా దాడులు మరింత ప్రాణాంతకంగా ఉంటాయని చైనా నివేదికలు పేర్కొన్నాయి. మైక్రోవేవ్ ఆయుధాల ముఖ్య ప్రయోజనం ఏమిటంటే అవి సాంప్రదాయ ఆయుధాల వలె బయటకు కనిపించే విధ్వంసాలను సృష్టించవు. ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డీ-లింక్ చేసి కనిపించని నష్టాన్ని కలిగిస్తాయి.

చైనా వ్యూహంలో TPG1000Cs, స్టార్‌లింక్-కిల్లర్ ఆయుధాల అభివృద్ధి భాగమని చెబుతారు. శాంతి సమయంలో నిఘా, నిఘా కోసం స్టార్‌లింక్ వంటి నెట్‌వర్క్‌లను ఉపయోగించవచ్చని, యుద్ధ సమయంలో, అవి చైనాకు చెందిన కీలకమైన సైనిక, పౌర ఆస్తులను రక్షించడంలో సహాయపడతాయని చైనా సైనిక నిపుణులు విశ్వసిస్తున్నారు.