Brazil Plane Crash: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది చనిపోయారు. ఈ ఘోర విమాన ప్రమాదం అమెజాన్ లో జరిగింది. ప్రఖ్యాత టూరిస్టు ప్లేసుగా పేరున్న బార్సెలోస్ లో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తుపాన తరహా వాతావరణం సమయంలో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రయాణికులంతా ఫిషింగ్ కోసం ఈ ప్రాంతాననికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారని బ్రెజిల్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 






అమెజాన్ రాష్ట్ర రాజధాని మనౌస్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సిలోస్ ప్రావిన్స్ లో ఈ విమానన ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన విమానం మనౌస్ ఏరోట్యాక్సీ ఎయిర్ లైన్స్ కు చెందినది అధికారులు చెబుతున్నారు. ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తామని మనౌస్ ఏరోట్యాక్సీ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. బార్సెలోస్ టౌన్ కి చేరుకునే ముందు వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పైలట్ అనుకోకుండా మధ్యలోనే విమానాన్ని ల్యాండ్ చేసినట్లు అమెజాన్ రాష్ట్ర భద్రతా కార్యదర్శి తెలిపారు. అదే సమయంలో విమానం ల్యాండింగ్ స్ట్రిప్ అయిపోయి క్రాష్ అయింది. విమానం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు వేగవంతం చేసినట్లు గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం EMB-110, బ్రెజిలియన్ విమానాల తయారీ సంస్థ ఎంబ్రేయర్ తయారు చేసిన ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్. అమెజానన్ రాష్ట్ర రాజధాని మనౌస్ నుంచి బార్సిలోస్ కు బయలుదేరిన 90 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను గుర్తించేందుకు రాష్ట్ర రాజధానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.


Read Also: Rajasthan Road accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- 11మంది మృతి