buffalo Donald Trump Bangladesh: బక్రీద్‌కు ముక్కలు కాకుండా ట్రంప్ బతికిపోయాడు - ఎలాగో తెలుసా?
Eid al-Adha sacrifice rescue: బక్రీద్ బలి కోసం సిద్ధం చేసిన 'డొనాల్డ్ ట్రంప్' అనే అల్బినో ఎనుబోతును బంగ్లాదేశ్ ప్రభుత్వం కాపాడి జూకి తరలించింది.

Rare white bull Dhaka Zoo: బంగ్లాదేశ్‌లో బక్రీద్ త్యాగాల కోసం సిద్ధం చేసిన కోట్లాది జంతువుల మధ్య 700 కిలోల బరువున్న ఒక తెల్లటి ఎనుబోతు అందరి దృష్టిని ఆకర్షించింది. దీని యజమాని జియా ఉద్దీన్ మృధా సోదరుడు, ఆ జంతువు తలపై ఉన్న జుట్టు డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ హెయిర్ స్టైల్ తరహాలో ఉండటంతో దీనికి ట్రంప్ అని పేరు పెట్టారు. అరుదైన అల్బినో రకానికి చెందిన ఈ ఎనుబోతు సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్‌గా మారింది. పిల్లలు, పెద్దలు దీనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
చివరి నిమిషంలో ప్రభుత్వ ఎంట్రీ
కేరళీగంజ్ ప్రాంతానికి చెందిన మృధా ఈ ఎనుబోతును ఇప్పటికే బక్రీద్ బలి కోసం విక్రయించారు. గురువారం నాడు దీనిని కోయాల్సి ఉండగా, కొన్ని గంటల ముందే ప్రభుత్వం జోక్యం చేసుకుంది. బంగ్లాదేశ్ పశుసంవర్ధక శాఖ అధికారులు కేరళీగంజ్ పోలీసుల సాయంతో యజమానిని సంప్రదించి, ఇది అత్యంత అరుదైన జంతువు అని, దీనిని బలి ఇవ్వకుండా కాపాడాలని కోరారు. ఇది ఇంకా వయసులో చిన్నది కాబట్టి, మరికొన్ని ఏళ్లు పెంచవచ్చని సూచించి దీనిని స్వాధీనం చేసుకున్నారు.
#WATCH | Dhaka, Bangladesh | A viral albino buffalo nicknamed 'Donald Trump' relocated to the national zoo for preservation after being rescued from being sacrificed as part of the Eid al-Adha festival's 'Qurbani' ritual. https://t.co/28VYBqzJrU pic.twitter.com/xIvNrUKLSr
— ANI (@ANI) May 28, 2026
జూలో స్పెషల్ కేర్
ప్రభుత్వం కాపాడిన ఈ ట్రంప్ ఎనుబోతును నేరుగా ఢాకాలోని జాతీయ జూ పార్కుకు తరలించారు. అక్కడ దీని కోసం ప్రత్యేకంగా ఒక షెడ్, ఒక కేర్ టేకర్‌ను కూడా కేటాయించారు. ప్రస్తుతానికి దీనిని రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచి, ఆ తర్వాత సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బలి పీఠం ఎక్కాల్సిన ఈ జంతువు ఇప్పుడు జూలో ఒక సెలబ్రిటీగా తన జీవితాన్ని కొనసాగించబోతోంది.
A 700-kilogram albino buffalo in Bangladesh nicknamed ‘Donald Trump’ for its apparent resemblance to the US president has been sent to the national zoo after being spared from Eid al-Adha sacrifice by government intervention. pic.twitter.com/jfFJodOQZn
— The New Region (@thenewregion) May 28, 2026
త్యాగాల వేళ వింత ఘటన
సాధారణంగా బక్రీద్ నాడు బంగ్లాదేశ్‌లో దాదాపు 1.2 కోట్ల జంతువులను బలి ఇస్తారు. అయితే, ఈ ట్రంప్ ఎనుబోతు దాని రూపం వల్ల ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది. జంతువు ప్రాణాలను కాపాడటంతో పాటు, దాని అరుదైన జన్యువులను రక్షించడం కూడా ముఖ్యమని అధికారులు భావించడం విశేషం.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















