Bangladesh News: కోటా వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య నేపథ్యంలో, శనివారం సంతాప దినం పాటించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ ప్రకటించారు. ఆ రోజున బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవనతం చేస్తారని ఆయన తెలిపారు. 

Continues below advertisement

విద్యార్థి నాయకుడి హత్యతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. ఈ అస్థిర పరిస్థితుల్లో ఖలీదాకుమారుడు దేశానికి తిరిగి వస్తున్నారా? బంగ్లాదేశ్ అశాంతి నేపథ్యంలో BNP నాయకుడి పునరాగమనం? బంగ్లాదేశ్ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో' సమాచారం ప్రకారం, ఫిబ్రవరి ఎన్నికలకు ముందు డిసెంబర్ 25న దేశానికి తిరిగి రావాలని BNP నాయకురాలు ఖలీదా జియా కుమారుడు తారెక్ రెహమాన్ యోచిస్తున్నారు. 

ప్రథమ్ ఆలో నివేదిక ప్రకారం, లండన్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో ట్రావెల్ పాస్ కోసం ఖలీదా కుమారుడు దరఖాస్తు చేసుకున్నారు. 2007లో అరెస్ట్ అయి, మరుసటి సంవత్సరం విడుదలైన తర్వాత, చికిత్స కోసం తన కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వెళ్లారు తారక్ రెహమాన్. అప్పటి నుంచి లండన్‌లోనే బహిష్కృత జీవితం గడుపుతున్నారు. 

Continues below advertisement

ఇదిలా ఉండగా, ఖలీదా కుమారుడు పునరాగమనం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని BNP శిబిరంలో ప్రత్యేక సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీ ప్రచారంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, బంగ్లాదేశ్‌లోని ఢాకా ఆసుపత్రిలో BNP ఛైర్‌పర్సన్ ఖలీదా జియా చికిత్స పొందుతున్నారు. మొత్తంగా, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ మొత్తం పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఎన్నికల నేపథ్యంలో భద్రతపై రాయబార కార్యాలయాలకు బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి అసద్ ఆలమ్ సియామ్ హామీ ఇచ్చారు. 

ఎన్నికలకు ముందు కోటా ఉద్యమ నాయకుడు ఉస్మాన్ హదీ హత్యతో రాజధాని ఢాకా సహా బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఆయన మాట్లాడుతూ, 'షహీద్ ఉస్మాన్ హదీ భార్య, పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.' ఉస్మాన్ హదీ అకాల మరణంపై శనివారం ఒక రోజు 'జాతీయ సంతాప దినం'గా బంగ్లాదేశ్ ప్రకటించింది. అంతేకాకుండా, 'ఈ దారుణ హత్యలో పాల్గొన్న నేరస్తులందరినీ త్వరగా చట్టం ముందుకు తీసుకువచ్చి, వారిని శిక్షిస్తాం ' అని ఆయన తెలిపారు. ప్రధాన సలహాదారు మాట్లాడుతూ, 'హదీ మరణం బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య పరిధిలో తీరని లోటు. ఫాసిజం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు ప్రతీక హదీ.' ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.