అమెరికా సెంట్రల్ కమాండ్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 13, 2026 నాడు ఉదయం పది గంటలకు ఈ దిగ్బంధం అమలులోకి వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
Strait of Hormuz: "హర్మూజ్ జలసంధి స్వాధీనం" అమెరికా సంచలన ప్రకటన! ఇరాన్ నౌకలు కనిపిస్తే పేల్చేస్తామని హెచ్చరిక!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకొని అమెరికా నౌకాదళం చర్యలు ప్రారంభించింది. ఆంక్షలు ఉల్లంఘించిన ఇరాన్ నౌకలను పేల్చేస్తామని హెచ్చరించారు.

- హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ప్రకటించింది అమెరికా.
- ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలపై ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
- అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
- ఈ దిగ్బంధంతో ఇరాన్ వాణిజ్యానికి రోజుకు భారీ నష్టం వాటిల్లుతుంది.
Strait of Hormuz: ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి కేంద్రంగా పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఓడరేవులను వచ్చే, వెళ్లే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ నౌకాదళ దిగ్బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అటు ఇరాన్ ఇటు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకొని అమెరికా విధిస్తున్న ఈ నౌకాదళ దిగ్బంధాన్ని ఎవరైనా ఎదిరించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోల్ మీడియా ప్లాట్‌పామ్ ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, ఒక వేళ ఇరాన్ నౌకలు మా దిగ్బంధ ప్రాంతానికి సమీపంలోకి వస్తే వాటిని తక్షణమే నిర్మూలిస్తాం అని హెచ్చరించారు. సముద్రంలో డ్రగ్స్ డీలర్ల పడవలను ఏ విధంగా అయితే ధ్వంసం చేస్తామో, అదే రీతిలో అత్యంత వేగంగా, కఠినంగా ఇరాన్ నౌకలపై దాడి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 13 2026 నాడు ఉదయం పది గంటలకు ఈ దిగ్బంధం అమలు లోకి వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇరాన్ తీరప్రాంతం, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇరాన్ ఓడరేవులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీయడం, ఆ దేశ నౌకాదళ శక్తిని నియంత్రించడం ఈ దిగ్బంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం తీవ్రంగా దెబ్బతిందని, సుమారు 158 నౌకలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న అతి తక్కువ సంఖ్యలో ఉన్న పాస్ట్ అటాక్ షిప్స్ కూడా అమెరికా దళాలకు ముప్పుగా మారకుండా ముందస్తు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ వాణిజ్యానికి రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
అమెరికా నౌకాదళం ఈ దిగ్బంధాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. ఇరాన్ ఓడరేవుల నుంచి బయలుదేరే లేదా అక్కడికి వెళ్లే అన్ని దేశాల నౌకలను అమెరికా దళాలు అడ్డుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణించే వాణిజ్య నౌకల నిరంతరం అమెరికా నౌకాదళ రేడియో సందేశాలను గమనిస్తూ ఉండాలని అవసరమైతే ఛానల్ 16 ద్వారా సంప్రదించాలని CENTCOM సూచించింది. కేవలం ఇరాన్ ఓడరేవులతో సంబంధం లేకుండా, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాలను వెళ్లే నౌకలను స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని అనుమతిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
Frequently Asked Questions
హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం ఎప్పుడు అమలులోకి వచ్చింది?
ఈ నౌకాదళ దిగ్బంధం వల్ల ఇరాన్ కు ఎంత నష్టం వాటిల్లవచ్చు?
ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ వాణిజ్యానికి రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఈ దిగ్బంధం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఆ దేశ నౌకాదళ శక్తిని నియంత్రించడం ఈ దిగ్బంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
ఇరాన్ ఓడరేవులకు సంబంధం లేని నౌకలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయా?
లేదు, కేవలం ఇరాన్ ఓడరేవులతో సంబంధం లేకుండా, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాలను వెళ్లే నౌకలను స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని అనుమతిస్తామని అమెరికా స్పష్టం చేసింది.
ట్రెండింగ్ వార్తలు





















