Afghanistan is preparing for war against Pakistan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో  తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య  యుద్ధ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. ఆప్ఘన్ తమ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని పాక్ అంటోంది. కానీ తమపై దురాక్రమణకు పాల్పడుతోందని  ఆప్ఘన్ పాక్ పై విరుచుకుపడుతోంది.  

Continues below advertisement

ఆప్గనిస్తాన్‌లో ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు భారత్ మిత్రదేశం. పార్లమెంట్ భవనం కట్టివ్వడంతో పాటు ఎంతో సాయం చేసింది. అయితే తాలిబన్లు ఆప్ఘన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పాకిస్తాన్  తమతో తాలిబన్లు కలసి వస్తారని  ఆశలు పెట్టుకుంది. కానీ  అందుకే తాలిబన్ సానుభూతిపరులు పాకిస్తాన్ లోకి వస్తే పట్టించుకోలేదు. దాదాపుగా 30 లక్షలమంది ఆఫ్ఘన్  తాలిబన్  సానుభూతిపరులు పాకిస్తాన్ లోకి వచ్చారు. అయితే  వారంతా టెర్రరిస్టులు అని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ  సంస్థగా ఎర్పడి దాడులు చేస్తున్నారని   పాక్ అనుమానిస్తోంది. వారంతా టీటీపీ వర్గంగా ముద్రపడ్డారు. 

అందుకేవారు ఉన్న గ్రామాలపై దాడులు చేస్తోంది.  అక్టోబర్ 8న కైబర్ పక్తుంఖ్వా ప్రాంతంలో TTP దాడిలో 11 మంది పాక్ సైనికులు మరణించారు. వెంటనే  పాకిస్తాన్ 9 అక్టోబర్ తెల్లవారుజామున కబూల్, ఖోస్త్, జలాలబాద్, పాక్తికా ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైకులు చేసింది. ఆఫ్ఘన్ అధికారులు 'పౌరులపై దాడి'గా వర్ణించి, ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తాజాగా కాబూల్‌లో పేలుళ్లు జరిగాయి.పాకిస్తాన్ పనేనని  తాలిబాన్   ఆరోపించింది. T  పాక్ డిఫెన్స్ మంత్రి ఖవాజా ఆసిఫ్  దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ తాలిబన్లు ప్రతీకారేచ్ఛతో ఉన్నారు. భారత్ 2021 తాలిబాన్ అధికారం తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో దూరం పాటించింది, కానీ 2025లో మార్పు వచ్చింది.   తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తకీ ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిశారు. భారత్ కాబూల్‌లో రాయబారి కార్యాలయాన్ని తిరిగి తెరవడానికి, 20 ఆంబులెన్సులు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది.  పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య శత్రుత్వం 1947లో పాకిస్తాన్ ఏర్పాటు నుంచి  ఉంది.  ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఐక్యరాష్ట్ర సమితిలో పాకిస్తాన్ చేరికను వ్యతిరేకించింది.   పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు  ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించలేదు. పష్తూన్ ప్రాంతాల్లో 'పష్తునిస్తాన్' అనే విభజనవాద ఉద్యమాన్ని ప్రోత్సహిస్తోంది.కోల్డ్ వార్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్, సోవియట్ యూనియన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకుంది. భారత్ ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో కాన్సులేట్లు తెరిచి, పష్తునిస్తాన్‌ను మద్దతు ఇచ్చింది. 1979 సోవియట్ ఆక్రమణ తర్వాత పాకిస్తాన్ ముజాహిదీన్‌ను సహాయం చేసింది. 

Continues below advertisement

 పాక్-ఆఫ్ఘన్ మధ్య గొడవ  టెర్రరిజం, సరిహద్దు వివాదాలు, భారత్ ప్రభావం కలిసి ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోంది. భారత్ 'ప్రోత్సాహం' కాకుండా ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి సహాయం చేస్తోందని చెబుతోంది. పాకిస్తాన్.. తమ దేశంలో దాడులు  ఆపకపోతే.. తాలిబన్లు దేనికైనా తెగిస్తామని అంటున్నారు.