Women thrash AIADMK leader with broom for harassment: తమిళనాడులోని కుంద్రత్తూరు అనే ఊళ్లో పొన్నాంబళం అనే పొలిటికల్ లీడర్ ఉన్నాడు. అయనను కొంత మంది మహిళలు చీపురుకట్ట తిరగేసి కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళ చీపురుకట్టతో కొడుతూంటే.. పొన్నాంబరం పరువు పోతుందని .. కొట్టవద్దని వేడుకున్నాడు..కానీ పరువుకు తగ్గ పనులు చేశారా అంటే.. ఘోరమైన పని చేయబోయాడు.
అన్నాడీఎంకేకు ఆ ఊళ్లే తానే ప్రధాన నాయుకడ్నని తనను కాదంటే పుట్టగతులు ఉండవని చెప్పుకుటూ తిరుగుతూంటాడు.. పొన్నాంబళం. ఆయనకు ఆ ఊళ్లో కొన్ని ఇళ్లు ఉన్నాయి. సమీపంలో ప్రైవేటు పరిశ్రమలు ఉండటంతో అక్కడ పని చేసేందుకు మహిళలు వస్తారు. వారిలో చాలా మంది పొన్నాంబళంకు ఉన్న ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటూంటారు. వారితో అసభ్య చేష్టలకు దిగుతూంటాడు పొన్నాంబళం.
తిరగబడి కొడితే ఇల్లు ఎక్కడ ఖాళీ చేయమంటారోనని చాలా మంది సైలెంట్ గా ఉంటారు. వీలైనంతగా తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఓ మహిళ మాత్రం అలా అనుకోలేకపోయింది. చీపురుకట్ట తిరగేసింది.
పొన్నాంబరం వీడియో వైరల్ కావడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా పళని స్వామి ప్రకటించారు. కానీ పొన్నాంబళంపై తమిళనాడు వ్యాప్తంగా సెటైర్లు పడుతున్నాయి..
రాజకీయ నేతలు అయితే ఎవరికీ ఎక్కువ కాదని.. ఇంకా బాధ్యతగా ఉండాల్సిన వారు.. మహిళల్ని వేధిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.
పొన్నాంబళంపై కేసులు పెట్టి అరెస్టు చేయాలన్న డిమాండ్ ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు అధికారం పోయినా ఇలాగే వ్యవహరిస్తున్నారని వారిని కట్టడి చేయాలని అంటున్నారు.