Reel Turns Tragic: ఉత్తరకాశిలోని మణికర్ణిక ఘాట్‌లో ఓ యువతి రీల్స్ కోసం నీళ్లలోకి దిగింది. డాన్స్ చేయబోయి పట్టు తప్పి నీళ్లలో పడిపోయింది. కొట్టుకుపోయింది. ఆమె మృత దేహం కోసం గాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ మరియు లైక్స్ కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వీడియోలో, ఆమె బిడ్డ నీటిలోకి జారిపడినప్పుడు "అమ్మా" అని అరవడం వినిపించింది. ఇప్పటివరకు, పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని వెలికితీయలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా రీల్స్ కోసం ప్రయత్నించి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరం జూలైలో ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆన్వి కామ్‌దార్ (26), మహారాష్ట్రలోని రాయ్‌గడ్ సమీపంలోని కుంభే జలపాతం వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షూట్ చేస్తున్నప్పుడు లోయలో పడి మరణించారు. తన స్నేహితులతో కలిసి రీల్ చిత్రీకరిస్తుండగా ఆన్వి కామ్‌దార్ 350 అడుగుల లోయలో పడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆన్వి మరణించింది.
ఇలాంటి వీడియోలను ప్రాణాలకు పణంగా పెట్టి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు దీన్ని పిచ్చిగా అభివర్ణిస్తున్నారు. మణికర్ణిక ఘాట్‌లో చనిపోయిన యువతి.. చివరి మాటగా అమ్మా అని అరవడం వీడియోలో ఉంది. ఇది చాలా మంది మనసులను కలచి వేసేలా చేసింది.
ఎవరూ ఇలాంటి రిస్కులు కేవలం రీల్స్ కోసం తీసుకోవద్దని సోషల్ మీడియాలో చాలా మంది సలహాలు ఇస్తున్నారు. రీల్స్ కోసం రైళ్లు ఎక్కి.. ప్రాణాలు కూడా కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ తీసి.. వ్యూస్ పెంచుకుని ఏదో సాధించాలని యువత అనుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడు ట్రైన్ కింద పడుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.