బెల్జియంకు చెందిన టిమ్మర్ సన్స్ అనే మహిళ ప్రతీ రోజూ అంట్‌వెర్ప్ ప్రాంతంలో జూకు వెళ్లేది. ప్రతీ రోజూ వెళ్లేది. రోజులో ఎక్కువ సేపు జూలోనే గడిపేది. మొదట్లో ఆమెకు జంతువులపై ప్రేమ ఎక్కువని జూ సిబ్బంది అనుకున్నారు. అయితే ఆమె జూ మొత్తం తిరగడం లేదు. ఒక్క చోటే ఎక్కువ సేపు గడుపుతోంది. చీతా అని పిలించే 38ఏళ్ల చింపాంజీతో పిచ్చపిచ్చగా మాట్లాడుకునేది. గ్లాస్‌కు అటువైపు చింపాంజీ.. ఇటు ఏడీ టిమ్మర్‌మన్స్ ఏదేదో మాట్లాడుకునే వాళ్లు. అక్కడే ముద్దులు పెట్టుకునే వారు. ఇలా ఒకట్రెండు వారాలు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాలు నుంచి సాగుతోందీ వ్యవహారం.
ఇలా శ్రుతిమించిపోతున్న వీళ్లద్దరి ప్రేమవ్యవహారంపై జూ అధికారులు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. దీన్ని కంట్రోల్ చేయకుంటే ప్రమాదం తప్పదని గ్రహించి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. జూకు రావద్దని ఆమెపై నిషేధం విధించారు. అయితే తాను చింపాంజీని ప్రేమిస్తున్నాని.. దానితో ఎక్కువ సేపు గడిపే సమయం ఇవ్వాలని ఆమె జూ అధికారులను ఆమె పట్టు బట్టారు. కానీ ఆమెపై జూ అధికారులు నిషేధం విధించారు. జూ అధికారులు తీసుకున్న చర్యలపై ఏడీ టిమ్మర్‌మన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింపాంజీని తాను ప్రేమిస్తున్నానని.. ఆ చింపాంజీ కూడా తనను ఇష్టపడుతుందని వాదించారు. అయితే జూ అధికారులు మాత్రం మెత్తబడలేదు.
ఇప్పటికీ ఆమె జూ అధికారులను బతిమాలుతున్నారు. ఆ చింపాంజీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని వేడుకున్నారు. అంతకు మించి ఏమీ వద్దని అభ్యర్థిస్తున్నారు. జూ అధికారులు కచ్చితంగా తమ ప్రేమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు ఏడీ టిమ్మర్‌మన్స్ చెబుతున్నారు. చీతా కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదని ... వేరే చింపాంజీలతో కలవలేదని చెబుతున్నారు ఏడీ టిమ్మర్‌మన్స్. ఈ విరహం చీతాకు కూడా మంచిది కాదని ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారామె.
ఈ ప్రేమ సంగతి తెలిసిన చింపాంజీ ప్రేమికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దర్నీ విడదీయడం సరికాదు అని సలహా ఇస్తున్నారు. జూ అధికారులు చేసింది చాలా తప్పని వాదిస్తున్నారు. ప్రేమికులరాలికి మద్దతు ప్రకటించారు. ఇప్పటికీ టిమ్మర్సన్ తన ప్రేమికుడ్ని కలిసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్ారు. చింపాంజీతో ప్రేమ కథా చిత్రం ఇంకా సుఖాంతం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు. కానీ ఆమె మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే జూ అధికారులు మాత్రం చింపాంజీ ... తన ప్రేమికురాలి ఎడబాటును తట్టుకుంటుందో లేదో చెప్పడం లేదు. ప్రేమికురాలి కోసం ఎదురు చూస్తుందో లేదో గోప్యంగా ఉంచుతున్నారు. ఆ చింపాంజీ.. తన ప్రేమికురాలు రావట్లేదని మర్చిపోతే.. టిమ్మర్‌సన్ లవ్ స్టోరీ కూడా ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోవాల్సిందే. ఒక వేళ ఆ చీతా కూడా విరహవేదనతో తిండి తినడం మానేస్తే మాత్రం ప్రేమ లోకానికి మంచి గుర్తింపు వచ్చినట్లవుతుంది.