Divorce: భర్త తాగుబోతు అని ప్రచారం చేసిన భార్య - క్రూరత్వం అని చెప్పి విడాకులిచ్చేసిన కోర్టు!
Court: తన భర్త తాగుబోతు అని ఆ భార్య ప్రచారం చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ భర్త కోర్టుకెళ్లాడు. కోర్టు మానసిక క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది.

Madhya Pradesh High Court News: భర్తపై తప్పుడు ఆరోపణలు చేయడం, పబ్లిక్ లో అవమానించడం మానసిక హింసగానే పరిగణించి విడాకులు మంజూరు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. తాను తాగుబోతునని తన భార్య తప్పుడు ప్రచారంచేస్తోందని .. ఇలా చేయడం అవమానించడం మానసిక హింసగా పరిగణించి విడాకులు ఇప్పించాలని ఓ భర్త హైకోర్టులో పిటిషన్ వేశాడు. విచారణ జరిపిన హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈ కేసులో ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. 2004లో వివాహం చేసుకున్నారు. పదమూడేళ్ల సంసారం తర్వాత 2017 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015 నుంచి సంబంధాలు దెబ్బతిన్నాయి. 2017లో వేరుగా ఉండటం మొదలైంది. భర్త మానసిక, శారీరక హింసలు చేస్తున్నారని 2015లో విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వయాలెన్స్ యాక్ట్ కింద భార్య పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి 2011లో లోక్ అదాలత్‌లో కాంప్రమైజ్ అయ్యారు. భర్త శారీరక దాడులు, నిర్లక్ష్యం చేయడం వంటివి అంగీకరించి, భార్య, పిల్లల పట్ల బాధ్యతగా ఉంటానని హామీ ఇచ్చాడు. తనపై భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడని.. తనకు విడాకులు అవసరం లేదని భర్త మారితే కలిసి ఉంటామని చెప్పింది. అప్పట్లో కాంప్రమైజ్ అయ్యారు.
అయితే తనను భార్య తాగుబోతుగా ప్రచారంచేస్తోందని భర్త 2018లో డివోర్స్ పిటిషన్ దాఖలు చేశాడు. మానసిక హింసకు గురి చేస్తున్నందున 2017 నుంచి విడిగా ఉంటున్నామని తెలిపాడు. తాను మద్యం తాగనని ఆయన కోర్టులో ప్రమాణ పత్రం ఇచ్చాడు. 2021లో ఫ్యామిలీ కోర్టు భర్త పిటిషన్‌ను తిరస్కరించింది. భర్త హైకోర్టుకు వెళ్లాడు. భార్య తప్పుడు మద్యపాన ఆరోపణలు చేయడం వల్లమానసిక హింస, ప్రభుత్వ ఉద్యోగిగా సామాజిక స్థితి దెబ్బతిన్నదని వాదించాడు. అయితే భార్య మాత్రం సాధారణ దంపతుల కలహాలు మాత్రమేనని.. తీవ్రమైన క్రూరత్వం ఏమీ లేదని వాదించింది. కాంప్రమైజ్ తర్వాత హింసించలేదని.. భర్త మారితే కలిసి ఉంటానని చెప్పింది.
అయితే కోర్టు.. భార్య, భర్తపై తప్పుడు మద్యపాన ఆరోపణలు భర్తను సామాజిక వర్గంలో అవమానించాయని గుర్తించింది. ప్రభుత్వ ఉద్యోగిగా స్థితి దెబ్బతిన్నదని.. సాధారణ కలహాలు కాకుండా, ఇది 'సీరియస్ అఫైర్'గా గుర్తించింది. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని గమనించారు. హైకోర్టు భర్త అప్పీల్‌ను అనుమతించి, మానసిక హింస ఆధారంగా డివోర్స్‌కు ఆమోదం ఇచ్చింది.





















