Who is Sivasri Skandaprasad engaged to BJP MP Tejasvi Surya: భారతీయ జనతా పార్టీ ప్యూచర్ లీడర్లలో ఒకరు తేజస్వి సూర్య. కర్ణాటకకు చెందిన ఆయన చిన్న వయసులోనే ఎంపీ అయ్యారు. హిందూత్వ వాదాన్ని చాలా గట్టిగా వినిపించడంలో తనదైన శైలి చూపిస్తారు. ఆయన ఇటీవల తాను శివశ్రీ స్కంద ప్రసాద్ ను పెళ్లాడబోతున్నట్లుగా ప్రకటించారు. దీం1తో అందరూ ఎవరు ఈ శివశ్రీ స్కంద ప్రసాద్ అని సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఆమె చాలా మందికి తన గాత్రం ద్వారా చిరపరిచితమే. క్లాసికల్ సింగర్ , పలు సినిమాల్లోనూ పాటలు పాడారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి శివశ్రీ స్కందప్రసాద్
చెన్నైకి చెందిన శివశ్రీ స్కందప్రసాద్ శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ చేశారు. శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్-పార్ట్ 2 సినిమా కన్నడ వెర్షన్‌లో శివశ్రీ ఓ పాట పాడారు. ఆమె యూట్యూబ్ చానల్‌కు 2 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
పెద్దలు కుదిర్చిన పెళ్లే !
గతంలో రామ నవమి సందర్భంగా శివశ్రీ స్కందప్రసాద్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కన్నడ భక్తిగీతమైన ‘పూజిసలేండే హూగల తాండే’ని పాడిన వీడియోను పోస్టు చేశారు. అయితే ఆ వీడియోను ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి తన ఎక్స్‌లో ఖాతాలో షేర్ చేసి.. ఆమెను అభినందించారు.
తేజస్వి సూర్య బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి ఎంపీగా ఉన్నారు. 2019లో తొలిసారి పోటీ చేసిన సూర్య కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. సెప్టెంబర్ 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తేజస్వి సూర్య - శివశ్రీ స్కందప్రసాద్‌ల వివాహం 2025 మార్చిలో జరిగే అవకాశం ఉంది.