Supreme Court on Gender Change: హైదరాబాద్‌కి చెందిన ఓ IRS ఆఫీసర్‌ లింగ మార్పిడి (M Anusuya) కోసం అభ్యర్థించగా కేంద్రం అందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఇండియన్ సివిల్ సర్వీస్ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. మహిళగా ఉన్న తాను పురుషుడిగా మారాలనుకుంటున్నానని రిక్వెస్ట్ పెట్టుకోగా (M Anukathir Surya) హోం శాఖ అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే పదేళ్ల క్రితం సుప్రీంకోర్టు లింగమార్పిడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. థర్డ్ జెండర్ గుర్తింపు గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో కోర్టు ఓ విషయం తేల్చి చెప్పింది. జెండర్ ఐడెంటిటీ అనేది వ్యక్తిగతమని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్‌లకు ప్రాథమిక హక్కులు కల్పించకుండా అడ్డుకోవడంలో అర్థం లేదని వెల్లడించింది. రాజ్యాంగం వాళ్లకి కూడా హక్కులు కల్పించిందని గుర్తు చేసింది. ఓ వ్యక్తి తన అభిప్రాయాలు, ఆలోచనల మేరకు లింగ మార్పిడి చేయించుకోవడం ఇవాళ అందుబాటులో ఉన్న మెడికల్ సైన్స్‌తో సాధ్యమేనని తెలిపింది. పైగా మెడికల్ ఎథిక్స్ పరంగా అది సరైనదే అయినప్పుడు కచ్చితంగా గుర్తింపు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం IRS ఆఫీసర్‌ కేసుతో మళ్లీ ఇదంతా తెరపైకి వచ్చింది. 


"ట్రాన్స్‌జెండర్‌లకు ప్రాథమిక హక్కులు ఇవ్వకుండా అడ్డుకోవడంలో ఎలాంటి అర్థం లేదు. రాజ్యాంగం వాళ్లకి కూడా హక్కులు కల్పించింది. వాళ్లూ ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. వాళ్లకంటూ ఓ గుర్తింపునివ్వాల్సిందే. తమ అభిప్రాయాల మేరకు జెండర్‌ని మార్చుకునేంత మెడికల్ సైన్స్‌ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. మెడికల్ ఎథిక్స్ కూడా అందుకు అనుమతనిస్తున్నాయి. న్యాయపరంగానూ ఎలాంటి చిక్కులూ ఉండవు. వాళ్ల ఇష్టం మేరకు సర్జరీ చేయించుకుని లింగమార్పిడి చేయించుకుంటే కచ్చితంగా గుర్తింపునివ్వాలి"


- సుప్రీంకోర్టు