What is I Love Muhammad row: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మీలాద్-ఉన్-నబీ ఉత్సవాల సందర్భంగా ‘ఐ లవ్ ముహమ్మద్’ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ బ్యానర్‌లపై పోలీసులు 25 మంది ముస్లిం యువకులపై FIR నమోదు చేయడంతో ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లో నిరసనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛపై దాడిగా చూస్తుంటే, పోలీసులు సామాజిక సామరస్యాన్ని కాపాడటానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తున్నారు.
సెప్టెంబర్ 4న కాన్పూర్‌లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో ప్రవక్త ముహమ్మద్ జన్మదిన ఉత్సవం సందర్భంగా ముస్లిం సంఘం ‘ఐ లవ్ ముహమ్మద్ ’ అనే లైట్ బోర్డులు, బ్యానర్‌లు ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో సాధారణంగా హిందూ మత వేడుకలు జరుగుతాయి. ఈ బ్యానర్‌లపై హిందూ సంఘాలు, స్థానికులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ SHO కృష్ణ మిశ్ర ఈ బ్యానర్‌లు సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తాయని, మునుపటి సంవత్సరాల్లో ఇలాంటి ఆచారం లేకపోవడంతో FIR నమోదు చేశారు.
సెప్టెంబర్ 9న మత భావాలను గాయపరిచే చర్యలకు పాల్పాడ్డారని కొంత మందిపై కేసులు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్చా హక్కు ఉల్లంఘనగా ఆరోపిస్తున్నారు. FIR తెలిసిన వెంటనే ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో నిరసనలు నిర్వహించారు. . ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు పట్టుకుని, ప్రవక్తపై ప్రేమ వ్యక్తం చేయడం నేరం కాదని నినాదాలు చేశారు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ "ఇది మత స్వేచ్ఛపై దాడి, మేము భయపడము" అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నిరసనలు కొన్ని చోట్ల ఉద్రిక్తమయ్యాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ‘ఐ లవ్ రామ్’ లేదా ‘ఐ లవ్ ముహమ్మద్’ అని ఆయా వర్గాలు చెప్పం వారి హక్కు అని సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు. ముస్లిం సంఘాలు "ప్రవక్తపై ప్రేమ వ్యక్తీకరణ నేరం కాదు" అని చెబుతున్నారు. పోలీసులు ఉద్రిక్తతలను నివారించడానికి చర్యలు తీసుకున్నామని వాదిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తత సృష్టిస్తూండటంతో పలు చోట్ల పోీలసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.