Was Ex Pakistan PM Imran Khan Raped In Jail: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనపై జైల్లో అత్యాచారం జరిగిందని కొన్ని రిపోర్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రావల్పిండిలోని పాక్ ఎమిరేట్స్ మిలిటరీ హాస్పిటల్ (PEMH) నుండి ధృవీకరించినట్లుగా ఓ వైద్య నివేదిక వైరల్ అవుతోంది. మే 3, 2025న ఓ ట్విట్టర్ అకౌంట్ లో ఇమ్రాన్ ఖాన్ మెడికర్ రిపోర్టును పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిపోర్ట్ ప్రకారం ఇమ్రాన్ ఖాన్ పై శారీరక, లైంగికదాడి జరిగింది. దీని వల్ల గాయాలయ్యాయి. జననేంద్రియ గాయం కూడా ఇందులో ఉంది. రక్తస్రావం వంటి పరిస్థితులను కూడా మెడికల్ రిపోర్టులు సూచిస్తున్నాయి.
చాలా మంది ఇమ్రాన్ ఖాన్ పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
అది ఫేక్ డాక్యుమెంట్.. ఇమ్రాన్ ఖాన్‌పై అసత్యాలు ప్రచారం
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడికల్ రిపోర్ట్ అని ఒక ఫేక్ రిపోర్టును ఓ నెటిజన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆయన కస్టడీలో ఉన్న సమయంలో అత్యాచారానికి గురయ్యారని రిపోర్టులో పేర్కొన్నారు. వాస్తవానికి అది ఫేక్ మెడికల్ రిపోర్ట్. Imran Ahmed Khan Niazi అనే పేషెంట్ మెడికల్ రిపోర్టును ఫొటో షాప్ ద్వారా ఎడిట్ చేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా ఫేక్ రిపోర్ట్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో ఎలాంటి అత్యాచారినికి గురికాలేదు. ఈ రిపోర్ట్ మే 03 నాటిది, కానీ ఈ పోస్ట్ మే 02 రాత్రి 8:43 (పాకిస్తాన్‌లో రాత్రి 11:43)కి ప్రచురించారు. కనుక అది ఫేక్ డాక్యుమెంట్, అది ఇమ్రాన్ ఖాన్ మీద అసత్య ప్రచారం అని తేలిపోయింది.
ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయిన తరవాత అవినీతి ఆరోపణలపై ఆయనను జైల్లో పెట్టారు. కోర్టు శిక్ష విధించింది. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన అనుచరులు మాత్రం రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. కానీ ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతా వేటుకు గురయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో లైంగిక దాడి జరిగిందని ఆరోపణలు రావడం చర్చనీయాంసం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ దిగ్గజ క్రికెటర్ గా పేరొందారు. ఆయన నేతృత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ ను కూడా గెల్చుకుంది.