Waqf Bill is bringing many benefits: వక్ఫ్ బిల్లుకు  పార్లమెంట్ లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి గెజిట్ కూడా జారీ చేశారు. దీంతో చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ బిల్లు ముస్లిం వర్గాలకు అన్యాయం చేస్తుందని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, తమిళనాడు వంటి చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇండియా కూటమిపార్టీలు పార్లమెంట్ లో ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం మతపరమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది. కానీ చట్టంలోని అసలు నిజాలను దాచి ప్రచారం చేస్తూండటంతో ఆందోళనలకు ప్రేరేపిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం వర్గాలకు అనేక ప్రయోజనాలు

వక్భ్ బిల్లు వల్ల ముస్లింలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటి వరకూ ఎన్నో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. అలాగే ఏ ఆస్తినైనా  వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే పరిస్థితి ఉండేది. దీని వల్ల సమస్యలు వచ్చేవి.   వక్ఫ్ బోర్డులకు ఏకపక్ష అధికారాలను ఇచ్చే నిబంధన సెక్షన్ 40ని రద్దు చేయడంతో మతపరమైన ఆస్తుల దుర్వినియోగం తగ్గుతుంది.   వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ 

ఈ  చట్టం లక్ష్యం  వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత. పరిరక్షణ. డిజిటలైజేషన్  రిజిస్ట్రేషన్ ప్రక్రియల ద్వారా ఆస్తుల దుర్వినియోగాన్ని తగ్గించి, వాటిని మరింత సమర్థవంతంగా మసీదులు, మదర్సాలు, ఆస్పత్రులు,   సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చు. దీనివల్ల పేద ముస్లిములకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. 

 ఆక్రమణల నియంత్రణ 

వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలు దశాబ్దాలుగా ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ బిల్లు జిల్లా కలెక్టర్లు లేదా ఇతర అధికారుల ద్వారా సర్వేలను నిర్వహించి, ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవచ్చు.  దీనివల్ల వక్ఫ్ ఆస్తులు తిరిగి సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది.

 వివిధ వర్గాల ప్రాతినిధ్యం 

ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చడం  బోహ్రా, అఘాఖానీ వంటి ఇతర ముస్లిం ఉపవర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వంటి నిబంధనలు ఉన్నాయి. ఇది వక్ఫ్ నిర్వహణలో సమ్మిళిత విధానాన్ని ప్రోత్సహించి, అందరి ప్రయోజనాలను పరిరక్షించవచ్చని  భావిస్తున్నారు. అలాగే  2006 సచార్ కమిటీ నివేదికలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సంస్కరణలు అవసరమని సూచించింది.  ఆస్తుల ఆదాయాన్ని పెంచి, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా చట్టంలో ఉంది. 

 లిటిగేషన్ తగ్గింపు  

వక్ఫ్ ఆస్తులపై వివాదాలు   కోర్టు కేసులు గణనీయంగా తగ్గించేందుకు ఈ చట్టాన్ని  ఉద్దేశించారు.  స్పష్టమైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ద్వారా, ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత తొలగి, సమాజానికి మరింత స్థిరత్వం లభిస్తుంది.  ఇది ముస్లిం వ్యతిరేక చట్టమని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ  న్యాయం కోసం, పారదర్శకత కోసం చేసిన సంస్కరణ. రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లనే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.