Viral News in Telugu: టీమ్ మీటింగ్ అంటే అంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోతారు. ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం టీమ్ మీటింగ్‌లో డ్యాన్స్ చేసింది. ఓ బాలీవుడ్ పాటకి అదుర్స్ అనిపించేలా స్టెప్పులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ ఈ వీడియో షేర్ చేసింది. ఆఫీస్ మీటింగ్‌ రూమ్‌లో అందరి ముందు డ్యాన్స్ చేసింది. ఇది చూసిన వెంటనే తోటి ఉద్యోగులంతా గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టి ప్రశంసించారు. ఈ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ కూడా ఫన్నీగా ఉండడం వల్ల వైరల్ అయిపోయింది. 




ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. టీమ్ మీటింగ్స్‌లో ఇలాంటి క్రియేటివిటీ కచ్చితంగా ఉండాలని కొందరు కామెంట్ చేస్తుండగా ఇంక్రిమెంట్ కోసం ఇలాంటివి తప్పవేమో అని మరి కొందరు సరదాగా కామెంట్ పెడుతున్నారు. ఇలాంటి టీమ్ మీటింగ్ ఎక్కడా చూడలేదని ఇంకొందరు అంటున్నారు. అంత మంది ముందు డ్యాన్స్ చేయాలంటే గట్స్ ఉండాలని మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు.