Delhi Temperature: ఢిల్లీలో విపరీతమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ తరవాత కాస్తంత తెరపినిచ్చినప్పటికీ అంతకు ముందు వరకూ ఉక్కపోత భరించలేకపోయారు. స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వాళ్లను ఇంటికి చేర్చేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ (AC Blast) అయ్యాయి. ఈ ఉక్కపోతతో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. 52.4 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు అందరూ కూలర్‌లు, ఏసీలు వాడుతున్నారు. ఈ క్రమంలోనే నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏసీ వేడెక్కి పేలిపోయింది. భారీ పేలుడు తరవాత ఫ్లాట్ అంతా మంటలు అంటుకున్నాయి. ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక విపరీతంగా వేడెక్కిపోయి పేలింది. మంటలు వ్యాప్తి చెందిన వెంటనే అందరూ కిందకు వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఓ ఫ్లాట్‌లో నుంచి పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది.
ఢిల్లీలో ముంగేశ్‌పూర్‌లో రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే...ఈ ప్రమాదానికి వాతావరణం కారణం కాకపోవచ్చని, లోడ్ ఎక్కువై పేలి పోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 79 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగించింది. నోయిడాలోనే కాదు. అటు యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఝాన్సీ ఏరియాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌ల్ ఏసీ పేలుడుతో భారీగా మంటలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వెంటనే మంటలు ఆర్పేసింది.