Viral Video: 


ఉత్తర భారతంలో భూకంపం.. 


ఉత్తర భారతం భూకంపంతో వణికిపోతోంది. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా భూమి కంపించింది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు అక్కడి ప్రజలు. జమ్ముకశ్మీర్‌లోనూ పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా చికిత్స అందిస్తున్నారు. తమ ప్రాణాలన్నీ లెక్క చేయకుండా రిస్క్ తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భూమి కంపిస్తుండగానే వైద్యులు ఓ మహిళకు డెలివరీ చేశారు. సిజేరియన్ చేసే సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. అయినా ఏ మాత్రం భయపడకుండా అక్కడే నిలబడిపోయారు. ఆపరేషన్ థియేటర్‌లోని వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. సర్జరీ మధ్యలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. కాసేపటికే పవర్ కూడా కట్ అయింది. ఆపరేషన్ థియేటర్‌ అంతా చీకటితో నిండిపోయింది. వెంటనే మెడికల్ స్టాఫ్ అంతా దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆ తరవాత కొద్ది సేపటికి కరెంట్ వచ్చింది. ఇదంతా జరుగుతున్నా వైద్యులు సర్జరీ ఆపలేదు. ఆ మహిళకు డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.