Doctor Roams Naked: హాస్పిటల్‌కి ఫుల్‌గా తాగి వచ్చిన డాక్టర్ వింతగా ప్రవర్తించాడు. బట్టలు విప్పి హాస్పిటల్ అంతా తిరిగాడు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. ఛత్రపతి సంబాజీనగర్‌లోని హాస్పిటల్‌లో వైద్యుడు ఇలా నగ్నంగా తిరిగాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం..45 ఏళ్ల డాక్టర్‌ మద్యానికి బానిసయ్యాడు. డ్యూటీకి వచ్చేటప్పుడే మత్తులో ఊగిపోతున్నాడు. టాయిలెట్‌కి వెళ్లిన డాక్టర్ బయటకు వచ్చేటప్పుడు ఒంటిపైన దుస్తులు లేవు. పైన ఉన్న ఆప్రాన్‌ని తీసేసి అటూ ఇటూ దులిపాడు. ఏం చేస్తున్నాడో తనకే తెలియనంతగా మత్తులో ఉన్నాడు. చాలా సేపు అలాగే తిరిగాడు. అక్కడే ఉన్న CC కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై ఉన్నత వైద్యాధికారులు స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, కచ్చితంగా ఆ వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. డ్రగ్స్‌కీ ఆ డాక్టర్ బానిస అయినట్టు తెలుస్తోంది. ఆ మత్తులోనే ఇలా చేసి ఉంటాడని అధికారులు చెబుతున్నారు.