Viral Video: క్రూర జంతువులు కూడా ఒక్కోసారి జాలి చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాం. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడింది.


ఇదీ సంగతి


హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఈ ఘటన జరిగింది. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుస్తుంది. ఇది గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లింది.


నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటిని చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి రక్షించింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను ఎలుగుబంటి పట్టుకుని బయటకు తీసింది. ఆ తర్వాత ఎలుగుబంటి ఆహారం కోసం మరో చోటుకు వెళ్లింది. కొద్ది సేపటికి కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది.




వైరల్ వీడియో


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని ప్రాణాలతో కాపాడిన ఎలుగుబంటికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.