అన్వేషించండి

Viral Brother Story: 10 మంది అక్కల ఓ తమ్ముడి కథ - ఇతని కష్టాలు వింటే మీ కష్టాలు చాలా చిన్నవని అనుకుంటారు!

Indian Wedding Debt: పది మంది అక్కల పెళ్లిళ్లు చేస్తానని తండ్రికి ప్రామిస్ చేశాడు కొడుకు. ముగ్గురు పెళ్లిళ్లకే 35 లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. ఇంకా ఏడుగురు ఉన్నారు!. తన బాధను వీడియోలో చెప్పుకున్నాడు.

10 Sisters Marriage Promise:  భారతీయ కుటుంబాల్లో  సెంటిమెంట్' అనేది ఒక బలమైన ఆయుధం. ముఖ్యంగా అది చావు బతుకుల్లో ఉన్న తండ్రి హాస్పిటల్ బెడ్ మీద అడిగిన కోరికైతే, ఇక కొడుక్కి తిరుగులేదు. పది మంది ఆడపిల్లల తర్వాత పుట్టిన సదరు  ముద్దుల కొడుకు  కూడా సరిగ్గా ఇదే ఉచ్చులో చిక్కుకున్నాడు. క్యాన్సర్ తో చివరి క్షణాల్లో ఉన్న తండ్రి.. కుమారుడిని దగ్గరకు తీసుకుని  "నాన్నా.. నీ పది మంది అక్కల పెళ్లిళ్లు నువ్వే చేయాలి, ఎవరినీ సాయం అడగకూడదు" అని  అడిగితే, ఆవేశంలో  సరే  అన్నాడు. అప్పుడు ఆయనకు తెలీదు.. అది  ప్రామిస్  కాదు, తన జీవితానికి రాసుకున్న  డెబిట్ వారెంట్ అని! 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ యువకుడి కథ వింటే జాలి పడాలో, అనుభవించు అని వదిలేయాల్లో ఎవరికీ అర్థం కాదు. ఇప్పటివరకు కేవలం  ముగ్గురు అక్కల పెళ్లిళ్లు చేసేసరికి మనోడి అప్పు  35 లక్షలకు  చేరింది. అంటే ఒక్కో పెళ్లికి సగటున 11 లక్షలకు పైగా  చేశారన్నమాట. ఇంకా ఏడుగురు క్యూలో ఉన్నారు. అంటే లెక్క ప్రకారం చూస్తే, మిగిలిన ఏడుగురికి మరో 2 నుండి 3 కోట్లు  కావాలి. వినడానికే షాకింగ్‌గా ఉంది . మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం నుండి రాలదుగా.. అప్పులే శరణ్యం!

ఈ గ్రేట్ ఇండియన్ వెడ్డింగ్  ఆడంబరాల పుణ్యమా అని, సదరు యువకుడు తన యవ్వనాన్ని బ్యాంకు ఈఎంఐలకే ధారపోస్తున్నాడు.  అందరి పెళ్లిళ్లు అయ్యాక, ఏమైనా  మిగిలి ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా  అని ఆయన నవ్వుతూ చెబుతుంటే, అది నవ్వులా లేక ఏడుపా అర్థం కావడం లేదు.  నాకు పిల్లలు పుట్టేసరికి నాకు 60 ఏళ్లు వస్తాయి, అప్పుడు వాళ్లు బుడిబుడి అడుగులు వేస్తుంటారు  అని ఆయన వేసిన జోక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్.

నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం  అబ్బా.. ఏం బాధ్యత, ఇలాంటి కొడుకు ఉండాలి  అని కీర్తిస్తుంటే, మరో వర్గం మాత్రం "బాధ్యత సరే.. కానీ ఈ ఆడంబరాల కోసం జీవితాన్ని తాకట్టు పెట్టడం తెలివైన పనేనా? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా! సింపుల్‌గా పెళ్లిళ్లు చేసి, ఆ డబ్బుతో అక్కాచెల్లెళ్ల పేరిట పొదుపు చేయవచ్చు కదా? కానీ మనకు పరువు ముఖ్యం కదా! సమాజం ఏమనుకుంటుందో అన్న భయం, బంధువుల మెప్పు కోసం చేసే ఖర్చులే మధ్యతరగతి వాడి పాలిట శాపాలు.  

మొత్తానికి ఈ యువకుడి కథ.. మన దేశంలోని మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక అజ్ఞానానికి, సామాజిక ఒత్తిళ్లకు ఒక నిలువెత్తు నిదర్శనం. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్పే, కానీ ఆ మాట కోటి రూపాయల అప్పుల్లో ముంచేది కాకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మన హీరో గారు తన మిగిలిన ఏడుగురు అక్కల పెళ్లిళ్లు ఎలా చేస్తారో, ఆ అప్పుల కుప్పలో నుండి ఎలా బయటపడతారో  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Vaibhav Sooryavanshi Mindset Analysis: ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!
ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Samantha: సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Embed widget