BJP leader Advani Joins Apollo Hospital | భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలొస్తున్నాయి. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో ఎయిమ్స్ లో ఒక రోజంతా ఉన్న అద్వానీ తిరిగి అపోలోలో చేరినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేయడంతో పార్టీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. 96 ఏళ్ల అద్వానీ.. వాజ్ పాయీ హయాంలో భారత ఉపప్రధానిగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో గౌరవించింది.