Food in Vande Bharat Rail: 


పాచిపోయిన ఫుడ్..


వందేభారత్ రైళ్లలో సర్వ్ చేస్తున్న ఫుడ్‌ చాలా దారుణంగా ఉంటోందంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. IRCTC ఇంత దారుణమైన ఫుడ్‌ పెడుతోందంటూ కొందరు ప్యాసింజర్స్‌ వీడియోలు తీసి పోస్ట్ చేశారు. న్యూ ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందేభారత్ రైల్లో చాలా నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నారని ఓ ప్యాసింజర్ మండి పడ్డాడు. ఆకాశ్ అనే ఓ ప్రయాణికుడు కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ ఫుడ్ మాకు అక్కర్లేదంటూ ప్రయాణికులు రిటర్న్ చేశారు. ఎలా ఉన్న ప్యాక్‌లను అలాగే తిరిగి ఇచ్చేస్తున్నారు. కూరలు పాచిపోయాయని, ఇలాంటి ఫుడ్‌ పెడతారా అంటూ ప్రశ్నించారు. ఇంత నాసిరకమైన ఆహారాన్ని ఎలా తింటామని మండి పడ్డారు. X వేదికగా ఈ పోస్ట్ పెట్టాడు ఓ ప్రయాణికుడు. ఈ పోస్ట్‌లో ఇండియన్ రైల్వేస్‌తో పాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అఫీషియల్ అకౌంట్స్‌నీ ట్యాగ్ చేశాడు.





ఈ పోస్ట్‌పై Railway Seva వెంటనే స్పందించింది. ఆ తరవాత IRCTC కూడా స్పందించింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. ఇలాంటి ఫుడ్ సర్వ్ చేసిన వాళ్లపై పెనాల్టీ విధిస్తామని హామీ ఇచ్చింది. 


"మీకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెబుతున్నాం. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. సర్వీస్‌ ప్రొవైడర్‌పై ఇప్పటికే పెనాల్టీ విధించాం. సర్వీస్ ప్రొవైడర్‌కి చెందిన స్టాఫ్‌పైనా కఠిన చర్యలు తీసుకున్నాం. లైసెన్స్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నాం. ఇకపై ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్స్‌పై నిఘా పెడతాం"


- IRCTC 


 






ఇండియన్ రైల్వేస్‌లో ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ప్యాసింజర్స్‌ పదేపదే కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. కానీ...క్వాలిటీలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కేవలం ఆహారంలోనే కాదు...రైల్వే ప్యాంట్రీల్లోనూ నాణ్యత మెయింటేన్ చేయడం లేదు. ఈ మధ్యే రైల్వే ప్యాంట్రీలో ఎలుకలు తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి ఆహారా పదార్థాలపై నుంచి ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. ఓ ప్రయాణికుడు ఈ వీడియో తీసి పోస్ట్ చేశాడు. గతేడాది అక్టోబర్ 15న రైల్లో ప్రయాణించే సమయంలో ఈ వీడియో తీసినట్టు చెప్పాడు ఆ నెటిజన్. ఇలాంటి ఘటనలు చూసి రైల్వేపై గౌరవం పోతోందని అసహనం వ్యక్తం చేశాడు. రైల్ జర్నీపై ఉన్న ఇష్టంతో వీడియో తీస్తుంటే ఉన్నట్టుండి ఇలా ఎలుకలు కనిపించాయని పోస్ట్ చేశాడు.


Also Read: బిడ్డకి జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని, హాస్టల్‌ వార్డెన్ సస్పెండ్