Man Drives Bus Over Wedding Guests: పెళ్లిలో మర్యాదలు తక్కువ అయ్యాయని పెళ్లి కొడుకు బంధువులు.. పెళ్లి కూతురు ఇంట్లో గలాటా చేయడం చాలా చోట్ల జరిగేదే. అయితే పెళ్లికి వచ్చిన వ్యక్తి తనకు భోజనంలో పన్నీర్ ముక్క మిస్ అయిందని..పెళ్లి జరగడానికి వీల్లేదని రచ్చ చేయడం మాత్రం అనూహ్యమే. ఇదే ఘటన యూపీలోని చందౌలీలో జరిగింది. 

భోజనంలో పన్నీర్ మిస్ అయిందని అతిథికి ఆగ్రహం             

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో ఒక వ్యక్తి ఒక వివాహ వేడుకపై మినీ బస్సుతో వీరంగం సృష్టించాడు. అతిధులపైకి బస్సు పోనిచ్చాడు. పెళ్లి మండపాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత ఆ బస్సుతోనే పరారయ్యాడు. అతని చర్యల కారణంగా పెళ్లి మండపం ధ్వంసం అయింది. మూడు లక్షల  రూపాయల మేర ఏర్పాట్ల కోసం పెట్టిన ఖర్చు వృధా అయింది. ఇంతకీ అతను ఎవరా అని ఆరా తీస్తే.. అంతకు ముందే భోజనాల దగ్గర  వివాహ విందులో అతనికి 'పనీర్' రాలేదని గొడవపడ్డాడని కొంత మంది చెప్పారు. దీంతో అందరూ ముక్కు మీద వేలేసుకోవాల్సి వచ్చింది.             

పెళ్లికుమార్తె బంధువు కావడం విధ్వంసం          

మొఘల్‌సరాయ్ కొత్వాలి ప్రాంతంలోని హమీద్‌పూర్ గ్రామంలో రాజ్‌నాథ్ యాదవ్ అనే వ్యక్తి కుమార్తెకు వివాహాన్ని నిశ్చయం చేశారు.   శనివారం సాయంత్రం ఆలస్యంగా వివాహ ఊరేగింపు  వేదిక వద్దకు చేరుకుంది. ఆలస్యమైనా అంతా బాగానే జరుగుతోందని అనుకున్నారు. ాకనీ   ఒక వ్యక్తి హాలులోకి ప్రవేశించి నేరుగా భోజనాలవైపు వెళ్లాడు. ఆ వ్యక్తి పేరు ధర్మేంద్ర యాదవ్ ఇతర వంటకాలతో పాటు పనీర్ కూడా దొరకకపోవడంతో, అతనికి కోపం వచ్చింది. చేయాల్సిన రచ్చ చేశాడు.          

మూడు లక్షలకుపైగా ఆస్తి నష్టం - వధువు తండ్రికి గాయాలు       

పనీర్  దొరకకపోవడంతో కోపం వచ్చి వివాహ వేడుక మధ్యలో బస్సు నడిపాడు, ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు  రూ. 3 లక్షలకు పైగా విలువైన వస్తువులు దెబ్బతిన్నాయని వధువు తండ్రి  రాజ్‌నాథ్ యాదవ్   పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఎంత కోపంగా ఉన్నాడంటే  పెళ్లికి వచ్చిన అతిథులపైకి  మినీ బస్సును పోనిచ్చాడు. గందరగోళం ఏర్పడటంతో, అతను బస్సులో హాల్ నుండి పారిపోయాడు.  వరుడి తండ్రి మరియు వధువు మామతో సహా అనేక మంది గాయపడ్డారు. వారణాసిలోని ఒక ట్రామా సెంటర్‌లో వారికి చికిత్స జరుగుతోంది.          

కేసు పెట్టిన తర్వాత రోజు పెళ్లి             

ఇక్కడో ట్విస్ట్ చోటు చేసుకుంది.  ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసే వరకు వివాహం జరగదని వరుడి తరపు వారు పట్టుబట్టారు.   వధువు తరపు వారు నిందితుడిపై కేసు నమోదు చేసిన తర్వాతే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహ వేడుక ముగిసింది.