UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు
UPI : డిజిటల్ మనీగా ప్రజలు వాడేస్తున్న యూపీఐ సేవలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అనేక చోట్ల ప్రజలు చెల్లింపులు చేయలేక తంటాలు పడుతున్నారు.
UPI is down for the first time: ఫోన్ పే, గూగుల్ పే పని చేయకపోతే వచ్చే సమస్యలను సామాన్యుడు ఇప్పటి వరకూ ఫేస్ చేయలేదు. మొదటి వారికి ప్రజలు ఆ కష్టం ఏమిటో అనుభవం అవుతోంది. యూపీఐ సేవలకు హఠాత్తుగా అంతరాయం ఏర్పడింది. ఫోన్ పే, గూగుల్ పే సహా ఏ యూపీఐ పేమెంట్స్ కూడా పని చేయడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా గగ్గోలు ప్రారంభమయింది.
కరోనా తర్వాత యూపీఐ పేమెంట్ వ్యవస్థ ఊపందుకుంది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే సహా పలు సంస్థలు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యాన్ని కల్పించాయి. ప్రతి గంటకు కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదు. తొలి సారి యూపీఐ డౌన్ కావడంతో చాలా మందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అసలు మొత్తం అదే పరిస్థితి అని తెలియడంతో.. కంగారు పడుతున్నారు.
ఇప్పుడు పది రూపాయలు పెట్టి టీ కొనుగోలు చేసేవారు కూడా క్యాష్ ఇవ్వడం లేదు. ఫోన్ పే చేస్తున్నారు. ప్రతిచోటా.. లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. వారి జేబుల్లో క్యాష్ పెట్టుకోవడం మానేశారు. ఇప్పుడు పలు దుకాణాల వద్ద.. పేమెంట్స్ చేయలేక ఇబ్బందిపడేవారు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇటు చేతిలో నగదు లేక.. అటు యూపీఐ పని చేయకపోతే ఇక చాలా మందికి తీర్చుకోలేని సమస్య అవుతుంది.
తమకు ఎదురవుతున్న కష్టాలను చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. యూపీఐకి ఏం సమస్య వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
అసలు సమస్య ఏమిటనన్నదానిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుంచి కానీ.. ఆర్బీఐ నుంచి కానీ ఎలాంటి ప్రకటన ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే వరకూ రాలేదు.