UP man died from a snakebite while playing with poisonous snake: పాములు మునుషుల్ని చూసి భయపడి పారిపోతాయి. అలాగే మనుషులు కూడా చూసి పారిపోవాలి. లేదంటే స్నేక్ క్యాచర్స్ ను పిలిచించి వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేయాలి.కానీ వాటితో ఆటాడుకుంటే కాటేస్తాయి. బతకడం కష్టం. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రాంపూర్ సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ భారీ సర్పం ప్రత్యక్షమైంది. ఆ పామును చూసి భయపడిన స్థానికులు దూరంగా ఉండిపోయారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి మాత్రం అందరి ముందు తనకు ఎంతో ధైర్యం అని నిరూపించాలనుకున్నారు. వెంటనే ఆ పామును పట్టుకుని ఆటలాడాడు. కాసేపు పాము విదిలించుకునేందుకు ప్రయత్నించింది కానీ వదలకపోవడంతో కాటు వేసింది. కాటు వేసిన కొద్ది సేపటికే సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.
సాధారణంగా అడవుల్లో ఉండే ఇటువంటి భయంకరమైన సర్పం జనావాసాల్లోకి రావడం అరుదు. కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు, శరీరంలోని నాడీ వ్యవస్థ క్షణాల్లో స్తంభించిపోతుందని, సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కాపాడటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ప్రజలు ఇటువంటి విష సర్పాలను చూసినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, సొంతంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవులతో తలపడటం ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో ఈ రాంపూర్ ఉదంతం మరోసారి నిరూపించింది.