Bride Delivers Baby Two Days After Marriage: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో భార్యకు నొప్పులు రావడంతో ఆమె భర్త హడావుడిగా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ ఆమెను లేబర్ రూంలోకి తీసుకెళ్లిన నర్సులు బయటకు వచ్చి భర్తకు శుభాకాంక్షలు చెప్పారు. పండంటి బిడ్డను కన్నారని చెప్పారు. దాంతో ఆ పెళ్లి కొడుక్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లోపలికి వెళ్లి చూస్తే తన భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది నిజమేనని తేలింది. ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు ఆ భర్త. ఎందుకంటే అప్పటికి అతనికి పెళ్లి అయి రెండు రోజులే అయింది.
ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పెళ్లి అయింది. ఇరవై ఆరో తేదీన బిడ్డను కన్నది. ఇలా ఎలా జరిగిందో ఆ కుటుంబానికి అర్థం కాలేదు. కానీ జరిగిన పరిణామాల్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఇంతగా ఎలా మోసపోయామని ఆశ్చర్యపోతున్నారు. ఆమె పెళ్లికి వచ్చినప్పుడు పెద్ద లెహంగా వేసుకుని వచ్చింది. ఆమె గర్భంతో ఉందన్న సంగతి తెలియకుండా దుస్తులు వేసుకుంది. అది పెళ్లి డ్రెస్ సరిగ్గా నప్పలేదేమో అనుకున్నారు. అంతే కానీ పెళ్లి కూతురుగా వచ్చిన అమ్మాయి కడుపుతో ఉందని మాత్రం ఊహించలేకపోయారు. అసలు అలాంటి ఆలోచనరాలేదు.
ఫిబ్రవరి 24న ఆ జంట వివాహం చేసుకున్నారు, మరుసటి రోజు వధువు తన అత్తమామల ఇంటికి వెళ్లింది, అక్కడ సాంప్రదాయ 'ముహ్ దిఖాయి' వేడుక జరిగింది. ఫిబ్రవరి 26 ఉదయం, వధువు ఉదయం కుటుంబానికి టీ అందించింది. అయితే, సాయంత్రానికి ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం ప్రారంభమైంది మరియు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె నడుము వరకు లెహంగా ధరించింది. అంత ఎత్తులో లెహంగా ధరిస్తే ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారని.. బహుశా చలిగా అనిపించి ఉండవచ్చు అని మేము అనుకున్నామని ్ంత కంటే ఎక్కువ ఆలోచించలేదని వరుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. పెళ్లి అయి నరెండు రోజులకే అది కూడా ఒక్క సారి కూడా శారీరకంగా కలవకుండా పుట్టిన బిడ్డకు.. పెళ్లి చేసున్న పాపాన తాను తండ్రిని కాలేనని ఆ భర్త అంటున్నాడు. ఆస్పత్రిలో ఉన్న పెళ్లి కూతురు మాత్రం తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేదు. ఆ తండ్రి ఎవరో కనుక్కునేందుకు ఇప్పుడు బంధువులు ప్రయత్నిస్తున్నారు.