Broter caught his sister having tiffin with her lover and beat: లవర్ తో కలిసి చెల్లి ఔటింగ్ కు వెళ్తే అక్కడకు లవర్ అన్న వస్తే సీన్ మారిపోతుంది. సినిమాల్లో ఇలాంటివి జరుగుతూంటాయి. మరి నిజంగా జరిగితే ఎలా ఉంటుంది ?. నిజంగానే యూపీలోని హత్రాస్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక యువతి తన ప్రియుడితో కలిసి హోటల్‌లో ఛోలే భటూరే తింటూండంగా హఠాత్తుగా ఆమె అన్న వచ్చాడు. అప్పటికి తన చెల్లి లవర్ తో వెళ్తోందని డౌట్ పడ్డాడేమో కానీ ఇద్దరూ ఛోలే భటూరే తింటున్న సమయంలో స్నేహితులతో కలిసి వచ్చాడు. తన సోదరిని లవర్‌తో చూసిన వెంటనే, సోదరుడు కోపంతో రగిలిపోయాడు. సోదరితో పాటు ప్రియుడిపై దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది.
ఈ గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన యువతిని కూడా సోదరుడు జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకొచ్చాడు. ఆమెపై దాడి చేశాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Xలో పోస్ట్ చేసిన వీడియో విస్తృతంగా వైరల్ అయింది. కొందరు ఈ దాడిని ఖండించారు. మోరల్ పోలీసింగ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. మరికొందరు ఈ ఘటనను హాస్యాస్పదంగా తీసుకుని, “ఛోలే భటూరే తినడం వల్ల జంటలకు ప్రమాదం” , “ప్రేమకు శత్రువు సోదరుడు” వంటి కామెంట్‌లు చేశారు.
