UP Election 2022: ఆహా తల్లి ప్రేమ..! 'నా కుమారుడికి టికెట్ ఇవ్వండి.. నేను రాజీనామా చేస్తాను'

ABP Desam   |  Murali Krishna   |  18 Jan 2022 05:26 PM (IST)

తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రీతా బహుగుణ జోషి ప్రకటించారు.

రీతా బహుగుణ జోషి

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ భాజపాలో రాజీనామాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. అయితే తాజాగా ఓ ఎంపీ కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఆ ఎంపీ.. సమాజ్‌వాదీ పార్టీ లేదా మరో పార్టీలోకి వెళ్లేందుకు రాజీనామా చేయడం లేదు. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తానంటున్నారు. ఆమె ఎవరో మీరే చూడండి.

ఎవరంటే?

రీతా బహుగుణ జోషి.. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి భాజపా ఎంపీగా ఉన్నారు. ఆమె కుమారుడు మయాంక్ జోషికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా టికెట్ ఇస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

2009 నుంచి నా కుమారుడు రాజకీయాల్లో ఉన్నాడు. లఖ్‌నవూ కాంట్ నియోజకవర్గం టికెట్ కోసం న్యాయబద్ధంగా దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తానని భాజపా భావిస్తే.. నేను నా ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ నా కుమారుడికి టికెట్ ఇవ్వండి. నేను పార్టీ కోసం ఏ పదివీ లేకపోయినా కష్టపడి పనిచేస్తాను. నా ప్రతిపాదనను పార్టీ అంగీకరించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించాను.                                              - రీతా బహుగుణ జోషి, భాజపా ఎంపీ

ఎన్నో ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న రీతా.. 2016లో భాజపాలో చేరారు. ఆమె కుమారుడు ప్రస్తుతం భాజపాలోనే ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వాలని ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఆమె లేఖ రాశారు.

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 18 Jan 2022 05:18 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.