One bride two grooms: ఉత్తరప్రదేశ్‌లో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. తాజాగా యూపీలో ఒకే మండపంలో, ఒకే వధువుకు ఇద్దరు వరులు పెళ్లి కొడుకులుగా వచ్చిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

Continues below advertisement

 ఒకే ముహూర్తం.. ఇద్దరు వరులు 

ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలీ ప్రాంతంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే వధువును వివాహం చేసుకోవడానికి వేర్వేరు ప్రాంతాల నుండి ఇద్దరు వరులు తమ తమ ఊరేగింపులతో  వధువు ఇంటికి చేరుకున్నారు. బ్యాండ్ బాజాలతో వచ్చిన ఈ ఇద్దరినీ చూసి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒకరు షామ్లీ జిల్లాకు చెందిన వరుడు కాగా, మరొకరు మీరట్ జిల్లాకు చెందిన వ్యక్తి. తమకే పెళ్లి ఖాయమైందని ఇరు పక్షాలు వాదించుకోవడంతో మండపం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Continues below advertisement

తల్లిదండ్రుల వ్యూహం.. బయటపడ్డ అసలు విషయం                       

అసలు విషయం ఏమిటంటే, వధువు తల్లిదండ్రులు మొదట ఒక వరుడితో పెళ్లి నిశ్చయించారు. అయితే, ఆర్థికపరమైన కారణాల వల్లనో లేదా ఇతర గొడవల వల్లనో ఆ సంబంధం క్యాన్సిల్ అయిందని భావించి, చివరి నిమిషంలో హడావిడిగా మరొక వరుడిని సిద్ధం చేశారు. కానీ, మొదటి వరుడు తమకు పెళ్లి రద్దు కాలేదని భావించి ముహూర్త సమయానికి ఊరేగింపుగా వచ్చేశాడు. అప్పటికే అక్కడ రెండో వరుడు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండటంతో అసలు రచ్చ మొదలైంది.

పోలీసుల ఎంట్రీతో ముగిసిన డ్రామా 

పెళ్లి మండపం కాస్తా పంచాయితీగా మారడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని ఆరా తీయగా మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. ఆ వధువు మైనర్ అని, ఆమె వయసు ఇంకా పెళ్లికి తగినంత లేదని విచారణలో తేలింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ వివాహాన్ని తక్షణమే నిలిపివేశారు. చివరకు ఇద్దరు వరులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.            

వైరల్ అవుతున్న విచిత్రమైన పెళ్లిళ్లు                               యూపీలోనే మరో వైపు, ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్లి చేసుకుని, ఇద్దరి పేర్లతో రెండు మంగళసూత్రాలు ధరించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తామంతా ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్నామని ఆమె చెప్పడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఇలాంటి పద్ధతులు కొన్ని గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయంగా ఉన్నప్పటికీ, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది.